హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా టెస్టులు,కరోనా ట్రీట్‌మెంట్... ప్రైవేట్‌లో చార్జీల వివరాలు ఇవే...

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్‌ను ప్రభుత్వం కరోనా టెస్టులకు అనుమతించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన మెడికల్ చార్జీలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఏ లక్షణాలు లేకుండా ఆస్పత్రికి వచ్చేవారికి టెస్టులు చేయవద్దన్నారు. లక్షణాలు ఉండి పాజిటివ్‌గా తేలినవారికి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందించాలన్నారు.

ఇవీ చార్జీల వివరాలు..

ఇవీ చార్జీల వివరాలు..

తాము ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటామని కొంతమంది సంపన్నులు,ఉన్నతవర్గాల వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని.. ఆ మేరకు ప్రైవేట్ ల్యాబ్‌లకు కూడా కరోనా టెస్టులకు అనుమతిస్తున్నామని చెప్పారు. కరోనా టెస్టింగ్ చార్జిని రూ.2200గా నిర్ణయించినట్టు ఈటల తెలిపారు. ఇక చికిత్సకు సంబంధించి సాధారణ ఐసోలేషన్‌లో రోజుకు రూ.4వేలు,వెంటిలేటర్‌ లేకుండా ఐసీయూలో రోజుకు రూ.7500,వెంటిలేటర్‌పై చికిత్సకు రోజుకు రూ.9వేలు చార్జీలుగా నిర్ణయించినట్టు తెలిపారు. ఇవి కాకుండా వెంటిలేటర్,ఐసీయూలో ఉన్న పేషెంట్లకు ఇచ్చే యాంటీ వైరల్ డ్రగ్స్,ఇంజెక్షన్స్‌కు వేర్వేరు చార్జీలు వసూలు చేసుకోవచ్చన్నారు. అయితే ప్రజలు

వారందరికీ కరోనా టెస్టులు..

వారందరికీ కరోనా టెస్టులు..


కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే పేషెంట్ల డేటాను తెలంగాణ పోర్టల్‌లో ఆస్పత్రి యాజమాన్యం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇక కరోనా నియంత్రణలో ముందుండి పనిచేస్తున్న వైద్యులు,మున్సిపల్ సిబ్బంది,జర్నలిస్టులందరికీ టెస్టులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కరోనా తీవ్రతను అంచనా వేసేందుకు త్వరలోనే జీహెచ్ఎంసీలో కరోనా టెస్టులు నిర్వహించబోతున్నామన్నారు. జియాగూడ,తలాబ్ కట్టా,బాలానగర్ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో టెస్టులు చేస్తామన్నారు.అలాగే వికారాబాద్,రంగారెడ్డి,మేడ్చల్,సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 30 నియోజకవర్గాల్లో కరోనా టెస్టులు చేస్తామన్నారు. 7 నుంచి 10 రోజుల్లో ఈ టెస్టులు పూర్తి చేస్తామన్నారు.

Recommended Video

#GandhiHospital : A Doctor From Gandhi Explains What happened Yesterday Night
50వేలతో ఆగదు..

50వేలతో ఆగదు..


టెస్టుల సంఖ్య 50వేలతోనే ఆగదని,ఆ టెస్టులు చేశాక... పరిస్థితిని బట్టి మరిన్ని టెస్టులు చేస్తామని ఈటల తెలిపారు. తెలంగాణలో టెస్టులు చేయట్లేదన్న ప్రచారం అబద్దమని ఖండించారు. కింగ్ కోఠి ఆస్పత్రిలో ఎంతమంది వచ్చినా టెస్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్‌లో ముందస్తు సర్వే నిర్వహించబోతున్నామని.. ఇందుకోసం ఏఎన్ఎం,ఆశా వర్కర్స్‌ను రిక్రూట్ చేసుకోబోతున్నామని తెలిపారు. ఢిల్లీ,ముంబై,అహ్మదాబాద్ నగరాల స్థాయిలో హైదరాబాద్‌లో కరోనా తీవ్రత లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 17వేల పడకలను కరోనా చికిత్స కోసం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రతీరోజూ ప్రస్తుతం 4వేల టెస్టింగ్ కెపాసిటీతో పనిచేస్తున్నామని.. త్వరలోనే మరో మెషీన్ కూడా అందుబాటులోకి వస్తుందని.. తద్వారా ప్రతీరోజూ మరో 3500 టెస్టులు పెరుగుతాయని చెప్పారు.

English summary
Telangana health minister Etela Rajender explained about the details of fee of coronavirus testings in private labs. He said government fixed Rs.2500 as fee for coronavirus test and the treatment charges are different.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X