వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఆవిర్భావం, కవిత శుభాకాంక్షలు: 'కేసీఆర్ ఓ ఇంజనీర్, సోషల్ సైంటిస్ట్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావి దినోత్సం సందర్భంగా ప్రజలకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సాకారం వల్లే మన రాష్ట్రం సాకారం అయిందన్నారు. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధన కోసం కనబరచాలని సూచించారు. జై తెలంగాణ.. జైజై తెలంగాణ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

Recommended Video

Telangana Formation Day : CM KCR Speech

మరిన్ని తెలంగాణ ఆవిర్భావ వేడుకల వార్తలు చదవండి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సం అద్భుత చిత్రాలు చూడండి

దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచింది

దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచింది

తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నివాళులు అర్పించారు. కరీంనగర్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు.

 కేసీఆర్ ఓ ఇంజనీర్, సోషల్ సైంటిస్ట్

కేసీఆర్ ఓ ఇంజనీర్, సోషల్ సైంటిస్ట్

వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని ఈటెల రాజేందర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ఇంజినీర్‌గా, సోషల్ సైంటిస్ట్‌గా మారి కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ చేశారని చెప్పారు. 46వేల చెరువులను మిషన్ కాకతీయలో పునరుద్ధరించినట్లు తెలిపారు. దేశంలో మిగులు పవర్ ఉందని చెబుతున్న ప్రతిపక్షాలు మిగతా రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదన్నారు.

నాడు ఉద్యమంలో, నేడు పాలనలో

నాడు ఉద్యమంలో, నేడు పాలనలో

ఎన్నో ఏళ్ల పోరాటం ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని మంత్రి కేటీ రామారావు అన్నారు. ఆయన సిరిసిల్లలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర పురోగమనాన్ని అడ్డుకోవాలనే ప్రతిఘాతక శక్తుల ప్రయత్నాలు నాడు పోరాటంలో ఎదురయ్యాయన్నారు. ఈనాడు పాలనలోను ఎదురవుతున్నాయన్నారు. సంకల్పం గట్టిగా ఉంటే దేనినైనా అవలీలగా ఎదుర్కోవచ్చన్నారు.

రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహం

రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహం

రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ బంగారు తెలంగాణ సాదిద్దామని కేటీఆర్ అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ దర్పణ్ ర్యాంకింగులో జిల్లాకు ప్రథమ బహుమతి వచ్చిందన్నారు. సిరిసిల్ల వస్త్ర, పరిశ్రమను ఆదుకోవడానికి, పరిశ్రమ నుంచి వస్త్రాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం క్యాలెండర్‌ను విడుదల చేసిందన్నారు.

English summary
Heartiest wishes on the Telangana State Formation Day !! It is the collective strength of T-people which made the statehood a reality.Let’s keep up the spirit until we achieve “Bangaru Telangana” !!! Jai Telangana !! Jai Jai Telangana !!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X