హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన ..అల్పపీడన ప్రభావంతో 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది .ఈదురుగాలులతో కూడిన వాన దంచికొడుతుంది . అసలే కరోనా కేసులు పెరుగుతున్న భాగ్యనగరంలో వర్షం పడటంతో భాగ్య నగర వాసులు టెన్షన్ పడుతున్నారు . మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం చిన్నగా మొదలై సిటీ అంతటా ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది .ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవటంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది .

Recommended Video

Heavy Rains In Hyderabad

 హైదరాబాద్లో కొంప ముంచిన ఓ బర్త్ డే పార్టీ ... ఒకే అపార్ట్ మెంట్ లో 23 మందికి కరోనా హైదరాబాద్లో కొంప ముంచిన ఓ బర్త్ డే పార్టీ ... ఒకే అపార్ట్ మెంట్ లో 23 మందికి కరోనా

కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ కురుస్తున్న వర్షంతో ప్రజలకు భయం

కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ కురుస్తున్న వర్షంతో ప్రజలకు భయం

హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు చేరింది . ఎండాకాలంలో కురుస్తున్న వర్షాలతో నగర వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నా కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ భయపడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది . లక్డీకాపూల్‌, పంజాగుట్ట, టోలిచౌకి, దర్గా, గోల్కొండ,జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాసబ్‌ట్యాంక్‌, విద్యానగర్, తార్నాక, కూకట్ పల్లి, మియాపూర్, ఫిల్మ్ నగర్, యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కొండాపూర్, బోరబండ, కొత్తగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

ఈదురుగాలులకు విరిగిపడుతున్న చెట్లు , ఫ్లెక్సీలు

ఈదురుగాలులకు విరిగిపడుతున్న చెట్లు , ఫ్లెక్సీలు

ఇక వర్షంతో పాటు విపరీతంగా కొన్ని చోట్ల ఈదురుగాలులు కూడా తోడవటంతో చెట్లు , ఫ్లెక్సీలు కూలిపడ్డాయి. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్‌ కు అంతరాయం కలుగుతుంది . దీంతో అత్యవసరాల కోసం వెళ్తున్న వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు .ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారటంతోనే వర్షం కురుస్తున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది .

రానున్న 24గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం

రానున్న 24గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం


రానున్న 24గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతే కాదు ఆది, సోమ వారాల్లో ఒక మోస్తరు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల కారణంగా చాలా మంది రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. పండిన పంటను విక్రయించుకునే సమయంలో కురుస్తున్న వర్షాలతో పంట పాడైపోయే పరిస్థితి ఉంటుంది. ఇది అన్నదాతకు నష్టం చేకూరుస్తుంది. అలాగే ప్రస్తుత కరోనా సమయంలో ఇలా వర్షాలు కురవటం కూడా మంచిది కాదని , కరోనా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని , అలాగే డయేరియా , డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు.

English summary
Heavy rain in Hyderabad today. The meteorological department has said that the low pressure in the southeastern Bay of Bengal has turned into a gale. The meteorological department has forecast heavy rainfall in Telangana over the next 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X