వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతన్నలకు శాపంగా అకాల వర్షాలు .. తడిసినా సరే ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని రైతుల నిరసనలు

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ ప్రభావం రైతుల మీద దారుణంగా పడింది. ఈసారి అన్ని ఆటుపోట్లను తట్టుకుని పంట పండించి మార్కట్ కు తీసుకువచ్చిన రైతులు మార్కెట్లలో, ఐకేపీ సెంటర్ల వద్ద పరిస్థితులకు కన్నీటి పర్యంతం అవుతున్నారు . ఇక అసలే ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆ సమస్యలకు తోడు అకాల వర్షాలు రైతులను దుఃఖ సాగరంలో ముంచుతున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నారు . భారీ వర్షాలతో కళ్ల ముందే వాళ్ళ కష్టం కొట్టుకుపోతుంటే ఆ రైతన్నలు కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు .

పండిన పంట అమ్ముకోలేక రైతన్నల దీనావస్థలు

పండిన పంట అమ్ముకోలేక రైతన్నల దీనావస్థలు

ఏ జిల్లాలో చూసినా కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతల గోస మనసును కలిచివేస్తుంది . పండిన పంటను తరలించటానికి లారీల కొరత , తీరా మార్కెట్ కు వస్తే 10 రోజుల దాకా కొనే దిక్కు లేని పరిస్థితులు , గాలి దుమారం , అకాల వర్షాలు వస్తే పంట తడవకుండా కాపాడుకోలేని పరిస్థితులు , క్వింటాలు ధాన్యానికి దాదాపు 6 కిలోల చొప్పున తేమ పేరుతో తీస్తున్న తరుగు, హమాలీలు లేక రైతులే హమాలీలు గా మారి పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతు దుర్భర పరిస్థితులను కళ్ళ ముందు ఉంచుతుంది . ఇక ఎక్కడ చూసినా గన్నీ బ్యాగ్స్ కొరత రైతులను వేధిస్తుంది. కరోనా లాక్ డౌన్ ప్రభావం ఒకవైపు, మార్కెట్ మాయాజాలం మరో వైపు రైతులకు ఊపిరాడనివ్వటం లేదు . ఇక తాజాగా కొన్ని ఘటనలు రైతన్నల దీన స్థితికి అద్దం పడుతున్నాయి.

కామారెడ్డి జిల్లాలో పంట తడిసిందన్న ఆవేదనతో కుప్ప వద్దే ఆగిన రైతు గుండె

కామారెడ్డి జిల్లాలో పంట తడిసిందన్న ఆవేదనతో కుప్ప వద్దే ఆగిన రైతు గుండె

కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ మండలం యాడారంలో చేతికందిన పంట అకాల వర్షంలో తడిసిపోవడంతో ఓ అన్నదాత ఊపిరి ఆగింది. ఒక రైతు ధాన్యం తడిసిపోవటంతో అమ్ముకోలేకపోతానేమో అన్న బాధతో ధాన్యం నూర్చే కుప్ప వద్దే ప్రాణాలు కోల్పోయాడు . ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చాకలి దేవరాజు అనే రైతు నేడు ఉదయం హఠాన్మరణం చెందాడు. అకాల వర్షం నుంచి తన ధాన్యాన్ని కాపాడుకోవాలనే తాపత్రాయంలో ధాన్యాన్ని కుప్ప చేస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు.

 కరీం నగర్ లో కొనుగోలు కేంద్రం వద్ద వర్షానికి తడిసిన ధాన్యం

కరీం నగర్ లో కొనుగోలు కేంద్రం వద్ద వర్షానికి తడిసిన ధాన్యం

ఇక కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవమ్‌పల్లి గ్రామంలో రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. ఒక్కసారిగా ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. జోరుగా కురుస్తున్న వర్షంలో ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు నానా ప్రయత్నాలు చేశారు. కుప్పలపై టర్పాయిన్లు కప్పేందుకు ప్రయత్నించినా ఈదురు గాలుల ధాటికి కుప్పలపై అవి నిలువ లేకపోయాయి. కళ్లెదుటే ధాన్యం కొట్టుకుపోతుంటే పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసిన రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు . ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వారంలో రెండు సార్లు కురిసిన వర్షం రైతులను కన్నీట ముంచింది . తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ధాన్యం , మొక్కజొన్న వెంటనే కొనుగోలు చెయ్యాలని రోడ్లపై బైఠాయించిన రైతులు

ధాన్యం , మొక్కజొన్న వెంటనే కొనుగోలు చెయ్యాలని రోడ్లపై బైఠాయించిన రైతులు


ఇక మరోపక్క బాసర మండలం కిర్గుల్(కే) గ్రామంలో రోడ్డుపై వడ్లు, మక్కలతో రైతులు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. మక్కలు కొనుగోలు చేయాలని ధర్నాకు దిగారు . ధాన్యం కొనుగోలులో కూడా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల నుంచి అధికారులు మక్కలు కొనుగోలు చేయడం లేదని , మక్కల కొనుగోలు కేంద్రాన్ని నెలరోజుల క్రితమే ప్రారంభించినప్పటికీ కొనుగోళ్లు మాత్రం చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం మాత్రం అన్నదాతలకు అండగా ఉన్నాం అన్న మాటలకే పరిమితం అవుతుంది .

English summary
This time, farmers who have managed to survive all the tide and bring the crop to market are tearful to the conditions at the markets and IKP centers. In addition to those problems, the unexpected rains are plunging the farmers into mourning. Farmers have been hit by rains across the state for the past week. farmers are trying to save the crop and there is no use due to the heavy rains .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X