హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షం, 3 రోజులు వానలే.. వానలే ..

|
Google Oneindia TeluguNews

వచ్చే 24గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు తెలిపారు. సోమ‌వారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన‌ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి.

 heavy rains chances in telangana state..

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా విస్తరించి ఉంది. అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహమూబాబాద్‌, ఖమ్మం జిల్లాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

గత రెండు రోజుల నుంచి వాతావరణం చల్లగా ఉంటోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ముసురేసింది. దీంతో ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు వస్తున్నారు. ఓ పక్క వైరస్ కూడా విస్తరిస్తోంది. దీంతో అత్యవసరం ఉంటే తప్ప జనాలు బయటకు రావడం లేదు. వైరస్ కేసులు పెరగడం.. చల్లని వాతావరణం చేటు అయినందున ఇంటిపట్టునే ఉంటున్నారు. బయటకి వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

English summary
heavy rains chances in telangana. especially hyderabad and some districts are effected weather officilas said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X