• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Heavy Rains: హైదరాబాద్‌లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు, టోల్ ఫ్రీ నెంబర్

|

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. గులాబ్ తుఫాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలో రానున్న 4-5 గంటల్లో భారీ నుంచి అతి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

హైదరాబాద్ తోపాటు ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లతి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమురంభీంఅసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.

 Heavy Rains: heavy rains in hyderabad, red, orange alert to Telangana district

గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో ఇప్పటి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యయి. కాగా, మరో 4-5 గంటల నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది.

భారీ వర్షాల కారణంగా జేఎన్టీయూహెచ్ పరిధిలో సోమవారం జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ పరీక్ష్లు వాయిదా పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ అధికారులతో కలెక్టరేట్‌లో కంట్రూల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040*23202813 సంప్రదించవచ్చన్నారు. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు.

భారీ వర్షాలు, అలర్ట్: కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అప్రమత్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే జిల్లా కలెక్టర్లతో పాటు రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్, ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆదివారం రాత్రి నుంచి ఎల్లుండి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రెండ్రోజుల పాటు రాష్ట్రంపై గులాబ్‌ తుపాను ప్రభావం ఉంటుందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

వాతావరణశాఖ ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించినట్టు తెలిపారు. జిల్లాల్లో పోలీసు, ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వరంగల్‌, హైదరాబాద్‌, కొత్తగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని పేర్కొన్నారు.

రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణలో రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారింది. ఈ తుఫాను ఉత్తర ఆంధ్రా- దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతాల్లో విశాఖపట్నం, గోపాల్ పూర్, కళింగ పట్నం దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu

  తుఫాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని అధికారులు సూచిస్తున్నారు.

  English summary
  Heavy Rains: heavy rains in hyderabad, red, orange alert to Telangana district
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X