హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వర్షాలు.. వరదల్లో భాగ్యనగరం

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ ‌సహా తెలంగాణ జిల్లాల్లో మంగళవారం(అక్టోబర్ 13) కురిసిన వర్షం జనాన్ని బెంబేలెత్తించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వాన జనాలకు వెన్నులో వణుకు పుట్టించింది. ఐదు లేదా ఆరు సెం.మీ వర్షపాతానికే అల్లకల్లోలమయ్యే నగరంలో 20సెం.మీ పైబడి వర్షం కురవడంతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత 18 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టేలా కురిసిన వర్షంతో చాలా ప్రాంతాలు చెరువులను,నదులను తలపించాయి. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో రాష్ర్ట ప్ర‌భుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో బుధవారం (అక్టోబర్ 13),గురువారం(అక్టోబర్ 14) ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి .నదుల్లో వరద ప్రవాహం మరింత పెరిగింది. వర్షాలు, వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

Heavy rains hit Telugu states, Hyderabad hit severely with floods live updates

ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై మినిట్-టూ - మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Newest First Oldest First
1:53 AM, 17 Oct

ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి
1:53 AM, 17 Oct

వరదనీటితో భాగ్యనగర వాసుల ఇక్కట్లు
11:17 PM, 16 Oct

వరదనీటితో హైదరాబాద్‌లో పలు కాలనీలు జలమయం
9:21 PM, 16 Oct

మణికొండ డ్యుప్లెక్స్ ఇళ్ల సముదాయంలోకి చేరిన వరదనీరు
7:52 PM, 16 Oct

వర్షాలతో కృష్ణానదీకి పోటెత్తిన వరదనీరు
1:21 PM, 16 Oct

వరదబాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం. నిలదీసిన స్థానికులు
9:42 AM, 16 Oct

వరద గుప్పిట్లో హైదరాబాదు..తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటి 50 మంది మృతి
1:28 AM, 16 Oct

హైదరాబాద్‌లో కొన్ని ఇళ్లకు చేరిన వర్షపునీరు
11:21 PM, 15 Oct

వర్షాల నేపథ్యంలో అధికారులతో సమీక్షిస్తోన్న సీఎం వైఎస్ జగన్
9:07 PM, 15 Oct

వర్ష ప్రభావంపై అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్
7:18 PM, 15 Oct

వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి 5 వేల కోట్ల నష్టం: సీఎం కేసీఆర్
6:57 PM, 15 Oct

దేశవ్యాప్తంగా రంగంలోకి 109 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. తెలంగాణలో 29 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి
6:31 PM, 15 Oct

వరద బాధితుల పరామర్శకు వెళ్లిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌కు చేదు అనుభవం. తిట్టిపోసిన మహిళలు
4:27 PM, 15 Oct

హైదరాబాదులో ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చిన వర్షాలు అయితే జలదిగ్బంధంలోనే చాలా కాలనీలు
2:05 PM, 15 Oct

జూబ్లిహిల్స్ అసెంబ్లీలో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి కిషన్ రెడ్డి
2:03 PM, 15 Oct

సంగారెడ్జి జిల్లా రాయికోడ్ మండలం లోని సింగీతం గ్రామంలో వర్షానికి కోతకు గురైన రహదారి పరిశీలించిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు, శాసన సభ్యులు చంటి క్రాంతి కిరణ్ ,జిల్లా కలెక్టర్ హనుమంతరావు.
10:24 AM, 15 Oct

హైదరాబాదు నగరంలో రాత్రి పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
10:18 AM, 15 Oct

వరదనీటిలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్
9:10 AM, 15 Oct

హైదరాబాదులో నీటమునిగిన వందలాది కాలనీలు...వరదనీటిలో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రజలు
9:09 AM, 15 Oct

ఎప్పుడూ లేనంత భారీ వర్షాలు కురవడంతో కనీవినీ ఎరుగని రీతిలో చిగురుటాకులా వణికిన హైదరాబాదు
2:08 AM, 15 Oct

వరదలపై రివ్యూ చేస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్
11:01 PM, 14 Oct

కొనసాగుతోన్న లోతట్టు ప్రాంత ప్రజల తరలింపు
10:04 PM, 14 Oct

వర్ష ప్రభావిత ప్రాంతాలకు చేరుకొన్న ఆర్మీ, సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
9:53 PM, 14 Oct

వర్షాల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు జగన్, కేసీఆర్‌తో మాట్లాడిన ప్రధాని మోడీ
9:47 PM, 14 Oct

హైదరాబాద్‌లో కురుస్తోన్న వర్షాలపై గవర్నర్, సీఎంలతో మాట్లాడిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
8:42 PM, 14 Oct

బండ్లగూడలో సహాయక చర్యలు చేపడుతోన్న ఆర్మీ
8:05 PM, 14 Oct

దమ్మాయిగూడ, సరూర్‌నగర్‌లో కొట్టుకువస్తోన్న కార్లు
7:34 PM, 14 Oct

దిల్ సుఖ్ నగర్ సాహితీ అపార్ట్ మెంట్ సెల్లార్ నీటిలో మునిగి అజిత్ సాయి అనే మూడేళ్ల బాలుడు మృతి.
7:04 PM, 14 Oct

మంత్రి తలసానితో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయొద్దీన్ ఉన్నారు.
7:03 PM, 14 Oct

ఉప్పల్ చెరువు వద్ద నిలిచిన నీరును పరిశీలించిన మంత్రి తలసాని.
READ MORE

English summary
Telangana government declared holidays on Wednesday and Thursday as Hyderabad witnessed heavy rains on Tuesday with heavy water-logging and traffic jams in different areas even as several other parts of the state reported similar weather conditions, which were triggered following a deep depression over the west-central Bay of Bengal, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X