హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారుమబ్బులు, దంచికొడుతున్న వర్షం: పట్టపగలే చీకట్లో బంజారాహిల్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో ఆదివారం నాడు వర్షం దంచి కొడుతోంది. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో, నగరంలో పలుచోట్ల చీకటి అలుముకుంది. మబ్బులు హైదరాబాదునుకమ్మేశాయి. భారీ శబ్దాలతో మెరుపులు వస్తున్నాయి.

నగరంలో పలుచోట్ల పట్టపగలే చిమ్మచీకటి కనిపిస్తోంది. కారుమబ్బుల కారణంగా జంట నగరాల్లో చీకటి కనిపిస్తోంది. కూకట్‌పల్లి, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్, ఉప్పల్... తదితర అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

Heavy rains in Hyderabad, Banjara Hills in dark

ముందు జాగ్రత్త చర్యగా పలుచోట్ల విద్యుత్ నిలిపేశారు. బంజారాహిల్స్, అమీర్ పేట ప్రాంతాలు చీకటిగా మారిపోయాయి. వర్షం దంచి కొడుతుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ శబ్దాలతో మెరుపులు వస్తున్నాయి.

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఎవరూ బయటకురాని పరిస్థితి కనిపిస్తోంది.

English summary
Heavy rains in Hyderabad, Banjara Hills in dark
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X