హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిట్ట మధ్యాహ్నమే చిమ్మచీకట్లు, ఈదురుగాలులతో హైదరాబాద్‌లో వర్షం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

మిట్ట మధ్యాహ్నమే చిమ్మచీకట్లు, ఈదురుగాలులతో హైదరాబాద్‌లో వర్షం

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లుంబినీ పార్క్, హిమయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురిసింది.

మధ్యాహ్నం మూడున్నర గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. పట్టపగలే రాత్రిలా కనిపించింది. ఓ వైపు ఈదురు గాలులు, మరోవైపు, చిమ్మ చీకట్లు, ఇంకోవైపు వర్షం. వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.

క్యూములోనింబస్‌ మేఘాల ప్రభావం కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. రోడ్లపై నీరు ప్రవహించడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అఫ్జల్ గంజ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం ధాటికి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వర్షానికి తోడు మెట్రో రైలు పనులు కొనసాగుతుండటంతో మరింత ఇబ్బందికరంగా మారింది.

Heavy rains in Hyderabad on Thrusday

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌తో పాటు కోఠి, సుల్తాన్‌బజార్‌, నాంపల్లి, ముషీరాబాద్‌, అంబర్‌పేట, కూకట్‌పల్లి, ఉప్పల్‌, చర్లపల్లి పారిశ్రామికవాడలలో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపోయాయి. దీంతో చర్లపల్లి ప్రాంతమంతా అంధకారం నెలకొంది. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.

పలు ప్రాంతాల్లో రోడ్లపై విరిగిన చెట్లను, రోడ్లపై పడిన వైర్లను తొలగించేందుకు జీహెచ్ఎంసి సిబ్బంది రంగంలోకి దిగారు. అత్యవసర బృందాలు నీళ్లు నిలిచే ప్రాంతాలకు వెళ్లి విరిగిపడిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు.

English summary
Heavy rains in Hyderabad on Thrusday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X