హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు భారీ వర్ష సూచన.. జర్నీలు వాయిదా వేసుకోవాల్సిందిగా కోరిన వాతావరణ శాఖ

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తతతో ఉండాలని హైదరాబాదులోని వాతావరణశాఖ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో పలు జిల్లాల్లో జూలై 24వ తేదీ వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు వచ్చి చేరుతుందని ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతేకాదు ఈ సమయంలో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపింది.

భారీ వర్షాలు: ముంబైలో కుప్పకూలిన రెండు భారీ భవనాలు, ఒకరు మృతి, శిథిల్లాల్లో..భారీ వర్షాలు: ముంబైలో కుప్పకూలిన రెండు భారీ భవనాలు, ఒకరు మృతి, శిథిల్లాల్లో..

ఇక గురువారం హైదరాబాదులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాల్సిందిగా కూకట్‌పలి జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి కాలు బయటకు పెట్టకుండా ఇళ్లకే ప్రజలు పరిమితం కావాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.ప్రస్తుతం తమ సిబ్బంది ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు.

 Heavy Rains in Telangana, Weather department asks people to postpone the journeys

ఇదిలా ఉంటే రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్కైమెట్ అనే ప్రైవేట్ వాతావరణ సంస్థ తెలిపింది. శనివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతుందని జోస్యం చెప్పింది. ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాలో తుఫాను ప్రభావం ఉన్నందున ఇద తెలంగాణ మీదుగా విదర్భా వరకు ఉంటుందని చెప్పింది. గురువారం ఉదయం నాటికి మెదక్ జిల్లాలోని కుల్చారంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Recommended Video

#MumbaiRains: Red Alert, Heavy Rainfall చిగురుటాకులా దేశ ఆర్ధిక రాజధాని ముంబై...!! | Oneindia Telugu

ఛత్తీస్‌గడ్ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు తుఫాను ప్రభావం ఉంది. ఉత్తర కర్నాటక పరిసరాల్లో కూడా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది.

English summary
Indian Meteorological Department (IMD) has forecasted heavy rains at isolated places in Telangana till July
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X