హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో భారీ వర్షం: జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గురువారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరం తడిచిముద్దయింది. నగరంలోని పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలు దేరిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గచ్చిబౌలి, రాజేంద్రనగర్‌, హైటెక్‌ సిటీ, బంజారాహిల్స్‌లలో ఈదురు గాలుతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం కాగా, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు ప్రవహించి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Heavy rains lash Hyderabad, city sees waterlogging and traffic jams

కాగా, గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఏడతెరిపిలేకుండా కురిసింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఆగస్టు 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆదేశించారు. దీంతో అధికారులు నగరంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరుపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

English summary
Heavy rain Thursday evening brought life in Hyderabad to a grinding halt. Several areas in the city witnessed water logging, even as massive traffic jams were seen in the city's Cyberabad area, near Cyber Towers and Hitec city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X