హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో భారీ వర్షం: నగరమంతా జలమయం, టీ20 మ్యాచ్ జరుగుతుందా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

IND Vs AUS 3rd T20 Prediction : Expect Rain Disruptions | Oneindia Telugu

హైదరాబాద్: భారీ వర్షాలతో నగరం అతలాకుతలం అవుతోంది. గురువారం సాయంత్రం మరోసారి కుండపోత వర్షం కురియడంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచి ఉండటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షం

భారీ వర్షం

భారీ వర్షం కారణంగా కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తమ ప్రయాణాన్ని మరో రెండు గంటలపాటు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ట్రాఫిక్‌ డీసీపీ రంగనాథ్‌ సూచించారు. లేకుంటే ట్రాఫిక్‌ జామ్‌ పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని ఆయన తెలిపారు.

జలయమం

జలయమం

గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, మలక్‌పేట, సరూర్‌నగర్‌, సంతోష్‌ నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మోహదీపట్నం, పంజాగుట్ట, అమీర్ పేట్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, రాంనగర్, ఎస్‌ఆర్‌ నగర్‌, ఎర్రగడ్డ, సనత్‌ నగర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌,నిజాంపేట, సికింద్రబాద్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, నారాయణగూడ, ట్యాంక్‌బండ్‌, హియాయత్‌ నగర్‌, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, కోఠీ, పాతబస్తీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

విరిగిన చెట్లు, నిలిచిన నీరు..

విరిగిన చెట్లు, నిలిచిన నీరు..

ఇక గాలులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. అలాగే కుండపోత వర్షంతో గ్రేటర్‌లోని 16 ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిందని అధికారులు గుర్తించారు. కాగా, శుక్రవారం కూడా హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

టీ20 మ్యాచ్ జరుగుతుందా?

టీ20 మ్యాచ్ జరుగుతుందా?

గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో ఉప్పల్ స్టేడియంలోకి భారీగారు నీరు చేరుకుంది. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పివేశారు హెచ్‌సీఏ అధికారులు. గురువారం రాత్రి కూడా వర్షం కురిస్తే మైదానం మొత్తం నీరుతో నిండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆస్ట్రేలియాతో టీమిండియా చివరి టీ20 జరుగుతుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి.

English summary
Heavy rains lashed Hyderabad on Thursday evening.. leading to water logging and massive traffic jams at several places in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X