వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ ప్రకటనే ప్రాణం తీసింది: పొడవు పెరగాలని మందులు వాడిన యువకుడు మృతి

|
Google Oneindia TeluguNews

వరంగల్: టీవీల్లో వచ్చే ప్రకటనలు ఎంతటి ప్రభావితం చేస్తాయో ఈ ఘటన చూస్తే తెలుస్తోంది. ఎత్తు పెరగాలన్న ఆశతో టీవీలో వచ్చిన వాణిజ్య ప్రకటన ప్రకారం సొంతంగా మందులు వాడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద మంగళవారం వనపర్తిలో చోటు చేసుకుంది.

వనపర్తి పట్టణంలోని బస్వన్నగడ్డలో నివాసముండే గోరీబీది నిరుపేద కుటుంబం. భర్త నాలుగేళ్ల క్రితం చనిపోవడంతో..ఆమె బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తూనే పిల్లల్ని చదివిస్తోంది.

 కుటుంబానికి బాసటగా నజీర్

కుటుంబానికి బాసటగా నజీర్

గోరీబీది కుమారుడు ఖాజా నజీర్‌ అహ్మద్‌ (17) స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతుండగా.. కుమార్తె అర్షియా మాహిన్‌ వరంగల్‌లో టీటీసీ చేస్తోంది. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో నజీర్‌ చదువు కొనసాగిస్తూనే.. ఖాళీ సమయంలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నాడు.

 పొడవు పెరగాలని..

పొడవు పెరగాలని..

కాగా, పొట్టిగా, బలహీనంగా ఉంటానన్న ఆత్మన్యూనతతో బాధపడుతున్న నజీర్.. ‘తాము సూచించే మందులు వాడితే ఎత్తు పెరుగుతారన్న' టీవీ ప్రకటనలు చూసి ఆశలు పెంచుకున్నాడు. ఆ మందులు వాడి పొడవు పెరగాలని అనుకున్నాడు.

ఆ మందులు వాడటంతో..

ఆ మందులు వాడటంతో..

ఈ క్రమంలో టీవీ ప్రకటనలో పేర్కొన్న మందును నాలుగు నెలల క్రితం ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాడు. మూడు రోజులపాటు దాన్ని వాడిన తర్వాత వాంతులు, విరేచనాలు మొదలవడంతో కుటుంబ సభ్యులు వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తాత్కాలికంగా ఉపశమనం కలిగినా.. కొన్నిరోజుల తర్వాత మళ్లీ అదే సమస్య పునరావృతమైంది. దీంతో మరోసారి అదే ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే, ఇన్‌ఫెక్షన్ల కారణంగా పరిస్థితి విషయమించినట్టు సోమవారం గుర్తించిన అక్కడి వైద్యులు మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.

 కన్నీరుమున్నీరైన నజీర్ తల్లి

కన్నీరుమున్నీరైన నజీర్ తల్లి

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ నజీర్‌ మంగళవారం మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని ఏర్పాట్లు చేస్తున్న తరుణంలోనే ఈ విషాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్పారు. కాగా, కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కుమారుడి మృతితో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. తమకు ఎవరూ లేరని ఆదుకోవాలని కోరారు. టీవీల్లో వచ్చే ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోవద్దని వనపర్తి జిల్లా వైద్యాధికారి డీఎంహెచ్‌వో శ్రీనివాసులు ప్రజలకు సూచించారు. కాగా, నజీర్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయమందేలా చూస్తామని స్థానిక నేతలు చెప్పారు. గతంలో ఓ యువకుడు కూడా పొడవు పెరగాలని హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స చేసుకుని ప్రాణాలకు మీదకు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

English summary
Height Gain Supplement Claims Youth Life in Wanaparthy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X