హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తస్మాత్ జాగ్రత్త..!: మార్చి 1 నుంచి లైసెన్స్ లేకపోతే 2వేలు, హెల్మెట్ లేకపోతే 100

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మీరు ద్విచక్ర వాహనాదారాలా? అయితే రేపటి నుంచి హెల్మెట్, లైసెన్స్ తప్పనిసరిగా మీ వెంట తీసుకెళ్లండి. ఎందుకంటే హెల్మెట్, లైసెన్స్ లేకండా వాహనంతో రోడ్డెక్కితే భారీ జరిమానా విధించనున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 2వేలు హెల్మెట్ లేకపోతే రూ. 100 కట్టాల్సిందే.

ఈ నిబంధనలను
కఠినంగా అమలు చేయాలని తెలంగాణ రవాణా, పోలీసు శాఖలు నిర్ణయించాయి. మార్చి 1వ తేదీ నుంచి ప్రత్యేక బృందాలు నగరంలో తనిఖీలు ముమ్మరం చేయనున్నాయి. తనిఖీల్లో తరచూ పట్టుబడే వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు.

రోడ్డు భద్రత నేపథ్యంలో రెండు శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళుతున్నారు. రోడ్డు భద్రతపై సుప్రీం కమిటీ సూచనలను ఖచ్చితంగా అమలు చేయడంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నిబంధనలు పాటించని వారికి చట్టప్రకారం శిక్ష పడేలా రంగం సిద్ధం చేస్తున్నారు.

Helmet is now mandatory for bike riders in Hyderabad

లైసెన్స్‌లు లేనివారు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రవాణాశాఖ నిర్ణయించింది. లైసెన్స్ లేని వారు, ఉండి సస్పెండ్ అయినవారు వాహనాలను నడిపితే శిక్షపడేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో మూడు సార్లకు మించి పట్టుబడిన వారు మళ్లీ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.

హెల్మెట్ తప్పనిసరి అని గత కొన్ని నెలలుగా నగరంలో విసృత్తంగా ప్రచారం చేసి అవగాహన కల్పించామని, అయినా చాలామంది వాడడం లేదని హైదరాబాద్ జిల్లా జేటీసీ టి.రఘనాథ్ తెలిపారు. మార్చి 1 నుంచి చేపట్టే తనిఖీల్లో హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే జరిమానా విధిస్తామని తెలిపారు.

పట్టుబడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. హెల్మెట్, లైసెన్స్‌తో పాటు ఫోన్ మాట్లాడుతూ సిగ్నల్ జంపింగ్, మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయడం, ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలపై రెండు శాఖల అధికారులు కఠినంగా వ్యవహారిస్తామన్నారు.

English summary
Helmet is now mandatory for bike riders in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X