వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్‌కు షాకింగ్ లేఖ.. చచ్చిపోవడానికి పర్మిషన్ కావాలంటున్న దంపతులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వారిద్దరి చూపులు కలిశాయి. ఇద్దరు మనుషులు వేరైనా మనసులు కలువడంతో ఒక్కటయ్యారు. అందరిలాగే వారి పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ఇంకేముంది రొటిన్ లవర్స్ మాదిరిగానే వారు కూడా పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకున్నారు. భాగ్యనగరంలో ఎవరి పనులు వారు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. అయితే ఇంతలో వారి జీవితాల్లోకి ఓ మాయరోగం వచ్చింది.

<strong>పాయింట్ బ్లాంక్‌లో పిస్టోల్ పెట్టి.. ముందు ముగ్గురు, తర్వాత ఇద్దరు.. ఆపై లైంగికదాడి </strong>పాయింట్ బ్లాంక్‌లో పిస్టోల్ పెట్టి.. ముందు ముగ్గురు, తర్వాత ఇద్దరు.. ఆపై లైంగికదాడి

దీంతో మకాం సిటీ నుంచి విలేజ్‌కి చేరింది. వైద్యం చేయించేందుకు ఉన్నదంతా ఊడ్చివేశారు. అయినా వ్యాధి నయం కాలేదు. దీంతో తమను ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారు. లేదంటే తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ మేరకు వారు సీఎంకు లేఖ కూడా రాశారు.

మనసులు కలిసి..

మనసులు కలిసి..

పండరి, స్వరూప పేర్లు వేరైనా మనసులు ఒక్కటే. మూడేళ్ల కిందట హైదరాబాద్‌లో కలిసిన వీరు .. తర్వాత ఒక్కటయ్యారు. ఒకరిపై మరొకరిపై ఎనలేని ప్రేమే వారిని కలిపింది. పండరిది కామారెడ్డి జిల్లా పెద్దకొడ్పుల మండలం వడ్గం కాగా .. స్వరూప స్వస్థలం మెదక్ జిల్లా కంటి గ్రామం. అందరిలాగే వీరి ప్రేమను కూడా పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ పెళ్లిచేసుకొని ఒక్కటయ్యారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో కాపురం పెట్టారు. పండరి పెయింటింగ్ వేస్తుండగా ... స్వరూప్ కూలీపనులు చేస్తూ జీవించారు. ఏ చీకూ చింత లేని వీరి కాపురంలో బ్రెయిన్ ట్యూమర్ రక్కసి ఎంటరైంది. వింత వ్యాధితో వారు ఆందోళనకు గురయ్యారు. దేవుడా అంటూ నిట్టూర్చారు.

బ్రెయిన్ ట్యూమర్ రక్కసి ..

బ్రెయిన్ ట్యూమర్ రక్కసి ..

మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడంతో ట్యూమర్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. వైద్యం చేయించేందుకు లక్షలు అవసరమవుతాయని వైద్యులు చెప్పడంతో బోరున విలపించారు. రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన కొంత డబ్బు పట్టుకొని .. మరికొందరి సాయంతో 3 లక్షల వరకు పొగుచేశాడు పండరి. అయినా స్వరూప మందులు, వైద్యానికి ఖర్చయిపోయాయి. దీంతో సిటీలో ఉండటం కష్టమని భావించి .. ఇంటికెళ్లిపోయారు. కానీ స్వరూప మందుల కోసం నెలకు వేలకు వేలు అవసరమవుతున్నాయి. కూలీ పని చేసే పండరి ఉన్నకాడికి పెట్టి వైద్యం చేయించాడు. ఇప్పుడు ట్రీట్ మెంట్ చేయించలేని స్థితిలో ఉన్నారు. దీంతో వారు తమను ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. స్వరూపకు వచ్చిన వ్యాధిని నయం చేసేందుకు ఆదుకోవాలని కోరారు. లేదంటే ఇద్దరు చనిపోయేందుకు మెర్సీ కిల్లింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

క్షీణిస్తోన్న ఆరోగ్యం ..

క్షీణిస్తోన్న ఆరోగ్యం ..

బ్రెయిన్ ట్యూమర్‌తో స్వప్న ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఓ కాలు, చేయి పనిచేయడం లేదు. అంతేకాదు సొంతంగా తాను లేవలేని పరిస్థితి. భర్త పండరి సాయం లేకుండా సొంతంగా నీళ్లు తాగలేని సిచుయేషన్ స్వరూపది. కట్టుకున్న భార్యను కంటిపాపాల చూసుకుంటున్నాడు పండరి. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను అపురూపంగా చూసుకుంటున్నాడు. సమయానికి మందులు వేస్తూ .. ఆలానా పాలానా చూస్తున్నాడు. కానీ ఆర్థిక పరిస్థితి తలచుకొని భార్య భర్తలు కుమిలిపోతున్నారు. మరోవైపు పండరికి గ్రామస్తులు ఆర్థికసాయం చేస్తున్నారు. వీరు చేసే సాయం మందులకే సరిపోతుందని పండరి చెప్తున్నారు. దాతలు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తల్లిదండ్రి ఉన్న అనాధలయ్యారు పండరి, స్వరూప. వారు ఎలాంటి సాయం చేయకపోవడంతో .. తమ కష్టంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అయితే వారికి ఊహించిన కష్టం రావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

English summary
Pandari.. Kamareddy district village in Vadgam. their love is not accepted by parents. The two got married. Hyderabad camps in Kukatpally. Swarooopa was working as a labour while Pandari was painting. Brain tumor has been entered in the camp of those who have not worries. They were concerned with the strange disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X