వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహితురాలితో పాడుపని.. ఆర్థిక లావాదేవీల్లో గొడవ... సతీశ్ హత్యకు కారణాలివే ..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ అమరావతి : వారిద్దరూ స్నేహితులు. చిన్నప్పటినుంచి కలిసే చదువుకున్నారు. వ్యాపారంలో కూడా భాగస్వాములు. కానీ వారి మధ్య గొడవకు ఓ మహిళ కారణమైంది. ఆమెతో వివాహేతర సంబంధాన్ని స్నేహితుడు జీర్ణించుకోలేకపోయారు. దీనికితోడు ఆర్థిక లావాదేవీల విభేదాలు కూడా కలిసాయి. ఇంకేముంది తన నేస్తాన్ని మట్టుబెట్టాడు కసాయి స్నేహితుడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో చీకటికోణం బయటపడింది.

స్నేహితులే ..

స్నేహితులే ..

ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన మైలా సతీశ్ బాబు, భీమవరానికి చెందిన హేమంత్ స్నేహితులు. వారిద్దరు కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదువుకున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య చదివించారు. ఏడాది క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. ఇద్దరు కలిసి స్లేట్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ సంస్థను ఏర్పాటు చేశారు. భార్య ప్రశాంతితో కలిసి సతీశ్ మూసాపేట ఆంజనేయనగర్‌లో ఉంటుండగా .. హేమంత్ అల్వాల్‌లో ఉంటున్నారు. అయితే ఇటీవలే కేపీహెచ్‌బీలోని 7వ ఫేజ్‌లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. భార్యతో కాకుండా ఒంటరిగా ఉండటంలోనే ఏదో కుట్ర దాడి ఉందని తర్వాత తెలిసింది.

క్లాసులు చెప్పుకుంటూ ..

క్లాసులు చెప్పుకుంటూ ..

కేపీహెచ్‌బీలోని తమ సాప్ట్ వేర్ కంపెనీతోపాటు .. ఎస్ఆర్ నగర్‌లో ప్రైవేట్ సంస్థలో ఐటీ విద్యార్థులకు సతీశ్ .. క్లాసులు చెప్పేవారు. అయితే సతీశ్ స్నేహితురాలు ప్రియాంక ఉన్నారు. ఆమెతో హేమంత్‌కు వివాహేతర సంబంధం ఉంది. దీనిపై స్నేహితుల మధ్య వాగ్వివాదం జరిగింది. తీరు మార్చుకోవాలని హేమంత్‌కు సతీశ్ చూపించారు. అయినా మారలేదు. దీనికితోడు స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీలపై వివాదం నెలకొంది. దీంతో సతీశ్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలని భావించాడు హేమంత్. ఇందుకోసం పథక రచన చేశాడు.

ఇంటికి పిలిచి ..

ఇంటికి పిలిచి ..

సతీశ్‌ను బుధవారం తన కేపీహెచ్‌బీ ఇంటికి ఆహ్వానించాడు హేమంత్. క్లాసులు ముగించుకొని .. కార్యాలయానికి వచ్చాడు సతీశ్. తర్వాత ఇంటికొస్తున్నాని భార్య ప్రశాంతికి ఫోన్ చేశాడు. కానీ అర్ధరాత్రి అవుతున్నా ఇంటికి రాలేదు. స్నేహితుడు ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్లాడు. మాట్లాడుదామని పిలిచి .. స్నేహితుడిపై దాడి చేశాడు హేమంత్. దారుణంగా హతమార్చినట్టు తెలుస్తోంది. తన భర్త ఇంటికి రాలేదని ప్రశాంతి పోలీసులకు పిర్యాదు చేశారు. అతని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా లోకేషన్ గుర్తుచేశారు. దీనికితోడు సతీశ్ భార్య.. హేమంత్‌పై అనుమానం వ్యక్తం చేయగా .. ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. హేమంత్ .. కేపీహెచ్‌బీ ఇంట్లోకి వెళ్లగానే సతీశ్ మృతదేహం కనిపించింది. దీంతో హేమంత్ హతమార్చాడని పోలీసులు నిర్ధారకణకు వచ్చారు. వీరి మధ్య ప్రియాంకతో వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలే కారణమని పేర్కొన్నారు. నిందితుడు హేమంత్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అతని కోసం రెండు బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు.

English summary
Myla Satish Babu from Martur in Prakasam district and Hemant from Bhimavaram. Both were educated at Korukonda Sainik School. Studied higher education abroad. He reached Hyderabad a year ago. Together they have formed a software company called Slate Consulting Pvt Ltd. Satish Moosapet with wife Prashanthi while staying in Anjaneyanagar .. Hemant Alwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X