వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Banks Holidays: సెప్టెంబరు నెలలో బ్యాంకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే..?

|
Google Oneindia TeluguNews

బ్యాంకుల కార్యకలాపాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా..? గత నెల ఆగష్టులో పలు పండగలు ఉండటం వల్ల బ్యాంకులు కూడా సెలవు దినాలు ప్రకటించాయి. మరోవైపు కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కూడా తగ్గించేలా నిర్ణయం తీసుకున్నాయి బ్యాంకు యాజమాన్యాలు. మరి సెప్టెంబర్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు ఎన్ని పనిదినాలు పనిచేస్తాయి.. ఏ రోజులు కార్యకలాపాలు జరగవు అనేది తెలుసుకుందాం.

Recommended Video

India’s Overall Growth For 2020-21 Projected at Minus 4.5%: RBI || Oneindia Telugu

సాధారణంగా బ్యాంకులు ప్రతి రెండవ శనివారం నాల్గవ శనివారాలు పనిచేయవు. ఆరోజు మూసివుంటాయి. ఇక ఆదివారాలు ఎప్పుడూ తెరుచుకోవు. ఈ విషయం తెలిసిందే. దీనికి తోడు బ్యాంకులు కొన్ని జాతీయ పండగల నాడు, లేదా ఆయా రాష్ట్రాల అధికారిక పండగల రోజున మూసే ఉంటాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ముందుగా తెలంగాణలో పైన చెప్పబడిన రోజులు కాకుండా ఈ నెల సెప్టెంబరులో అదనంగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ మూడు రోజులు బ్యాంకులు మూసి వేసి ఉంటాయి.

Here is the list of Bank Holidays in the month of September in AP and Telangana

సెప్టెంబర్ 12వ తేదీ రెండో శనివారం కాబట్టి బ్యాంకులు పనిచేయవు. సెప్టెంబర్ 18వ తేదీన బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఎందుకంటే ఆరోజు తెలంగాణలో బతుకమ్మ పండగ తొలిరోజు వేడుకలు జరుగనున్నాయి. ఇక సెప్టెంబర్ 26వ తేదీన నాల్గవ శనివారం కావడంతో బ్యాంకులు మూసిఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సెప్టెంబర్ నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయవు. సెప్టెంబర్ 12వ తేదీ రెండో శనివారం కాగా... సెప్టెంబర్ 26వ తేదీ నాల్గవ శనివారం కావడంతో ఆరోజు కూడా బ్యాంకులు మూసే ఉంటాయి.

ఇక దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ సెలవులు పెద్దగా లేనందున సెప్టెంబర్ నెలలో బ్యాంకులు యతావిధిగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. అదే సమయంలో మార్కెట్లు కూడా పనిచేస్తాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం స్థానిక పండగల కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించడంతో ఆ రోజున బ్యాంకులు పనిచేయవు. కర్నాటక, త్రిపురా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలల్లో మహాలయ అమావాస్య ను జరుపుకోనున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో సెప్టెంబర్ 17న బ్యాంకులకు సెలవు దినంగా ఉంది. ఇక కేరళలో సెప్టెంబర్ 2న శ్రీ నారాయణ గురు జయంతి కారణంగా బ్యాంకులు పనిచేయవు. 21 సెప్టెంబర్ శ్రీ నారాయణ గురు సమాధి రోజున కూడా బ్యాంకులు పనిచేయవు.

English summary
Banks in Telangana remain closed on September 18th as it is the first day for the start of Batukamma festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X