వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేసీఆర్ను కలిసిన హీరో నాగార్జున, బీజేపీ నేత దత్తాత్రేయ కూడా
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సోమవారం నాడు ప్రముఖ సినీ నటుడు నాగార్జున, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు కలిశారు. తన తనయుడు అఖిల్ వివాహ నిశ్చితార్థ వేడుకకు రావాలని నాగార్జున కేసీఆర్ను ఆహ్వానించారు.
హైదరాబాదుకు చెందిన డిజైనర్ శ్రియా భూపాల్తో అకిల్కు డిసెంబర్ 9వ తేదీన నిశ్చితార్థం జరగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన నాగార్జున ఆహ్వానించారు.

మరోవైపు కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కూడా కేసీఆర్ను కలిసి తన కుమార్తె వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు.
కాగా, అంతకుముందు టెన్నిస్ తార సానియా మీర్జా కూడా తన సోదరి వివాహానికి కేసీఆర్ను ఆహ్వానించారు. తండ్రితో కలిసి ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన సానియా.. తన చెల్లి పెళ్లికి సంబంధించిన శుభలేఖను కేసీఆర్కు అందించారు.