హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్‌తో విజయ్ దేవరకొండ భేటీ: చెప్పినట్లుగానే సీఎంఆర్ఎఫ్‌కు రూ.25లక్షల విరాళం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి సహాయనిధికి టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ రూ.25 లక్షల విరాళం ఇచ్చారు. ఇటీవల తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్‌ అవార్డును వేలం వేయగా డబ్బులను ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్)కు అందించారు.

 రూ.25లక్షల చెక్కును అందజేసి..

రూ.25లక్షల చెక్కును అందజేసి..

శుక్రవారం విజయ్‌ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రూ.25లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా విజయ్‌ను కేటీఆర్‌ అభినందించడంతో పాటు ఓ మొక్క ను కానుకగా అందించారు.

Recommended Video

Vijay Deverakonda filmfare Award Get Auctioned
హరితహారంలో విజయ్..

హరితహారంలో విజయ్..

అంతేగాక, హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని విజయ్ దేవరకొండను ఆయన కోరారు. పురపాలక శాఖ తరఫున చేప ట్టిన జలం జీవం కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణంలోనూ పాల్గొని, దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మంత్రి కోరారు.

విజయ్ హామీ.. కేటీఆర్ ఇలా..

విజయ్ హామీ.. కేటీఆర్ ఇలా..

త్వరలోనే జలమండలి అధికారులతో కార్యక్రమంలో పాల్గొంటానని విజయ్‌ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా అమ్మకాలు జరుపుతున్న వస్త్రాల తయారీని తెలంగాణలోనే చేపట్టాలని, దీనికి అవసరమైన సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి అపారెల్‌ పార్కు వస్త్ర తయారీదారులతో కలిసి పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

తొలి ఫిలింఫేర్ అవార్డు వేలం వేసి..

కాగా, ఇటీవ‌ల‌ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లోని జూబ్లీ 800లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫిలింఫేర్ అవార్డును వేలం వేశారు విజయ్. ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ ల్యాబరేటరీస్ అధినేత కిరణ్ దివి సతీమణి శకుంతల దివి రూ.25 లక్షలకు అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

English summary
Tollywood Hero Vijay Devarakonda met Telangana minister KTR on Friday and donated Rs. 25 lakh to CMRF.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X