వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోచుకొన్న డబ్బంతా చిత్తుకాగితాలుగా మారిపోయినందుకే ఆమె ఆందోళనలు చేస్తున్నారు

పెద్ద నగదు నోట్ల రద్దుతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆందోళనల వెనుక వేరే ఉద్దేశ్యాలున్నాయని కాంగ్రెస్,సిపిఎంలు విమర్శించాయి. శారదా, నారద చిట్ ఫండ్స్ ల ద్వారా ప్రజల నుండి ఆ పార్టీ నాయకులే ఎక

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోల్ కతా:పెద్ద నగదు నోట్ల రద్దుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి చేస్తోన్న ఆందోళన వెనుక వేరే ఉద్దేశ్యాలు ఉన్నాయని కాంగ్రెస్ , సిపిఎం లు మండిపడ్డాయి. నారద, శారదా కుంభకోణల్లో వెనకేసుకొన్న డబ్బు చిత్తు కాగితాల మాదిరిగా మారిపోవడంతో మమత ఆందోళనచేస్తున్నారని దుయ్యబట్టాయి.

పెద్ద నగదు నోట్ల రద్దు విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ఆందోళన చేస్తున్నారు. దేశంలోని వివిద రాష్ట్రాల్లో కంటే బెంగాల్ ముఖ్యమంత్రే ఈ విషయంలో మొడీ తీరును ఎండగట్టారు. రాష్ట్రపతికి వినతి పత్రం కూడ సమర్పించారు.

పెద్ద నగదు నోట్ల రద్దును నిరసిస్తూ పలు ర్యాలీల్లో ఆమె పాల్గొంటున్నారు.ప్రధానమంత్రి మోడీని లక్ష్యంా చేసుకొని విమర్శలు చేశారు. బెంాల్ లో జరిగిన శారదా, నారదా కుంభకోణాల్లో టిఎంసి నేతలు ఎలాంటి తప్పులు చేయనివారిగా బయటకు వచ్చి తమ సచ్ఛీలతను నిరూపించుకోవాలని కాంగ్రెస్, సిపిఎంలు డిమాండ్ చేశాయి.

 hidden agenda on mamata protest against old currency
పెద్ద నగదు నోట్ల రద్దు విషయంలో మమత చేస్తోన్న ఆందోళనలపై ప్రధానమంత్రి మోడీ కూడ తీవ్రంగా స్పందించారు.కుంభకోణాల్లో నిందితులైనవారు తనను తప్పుబడుతున్నారని ఆయన పరోక్షంగా శారదా, నారదా స్కాంల ను ప్రస్తావించారు.సామాన్యుల సమస్యల గురించి మమత పోరాడుతోంటే...సామాన్యుల సొమ్మును దోచుకొన్న ఆ పార్టీ నాయకుల నుండి డబ్బులను ఎందుకు రాబట్టలేకపోయారని సిపిఎం ప్రశ్నించింది.

టిఎంసి ఎంపిలే ఈ కుంభకోణంలో ఉన్నారని, నల్లధనం, కుంభకోణాలు, పెద్ద నోట్ల రద్దుపై మాట్లాడే హక్కు మమతకు లేదని సిపిఎం విమర్శించింది. పెద్ద నగదు నోట్ల రద్దుతో చిట్ ఫండ్స్ ద్వారా దోచుకొన్న సొమ్మంతా చిత్తు కాగితాలుగా మారడంతో ఆమె మొసలి కన్నీరు కారుస్తోందని సిపిఎం ఎంపి సలీం , కాంగ్రెస్ నేత అబ్దుల్ మన్నన్ విమర్శించారు.

English summary
tmc leaders involved sharada, narads scams ,west bengal chief minister mamata benarjee huge money gain with sharada, narada scams allegattion congress cpm,currency ban decission oppose mamata.who are involved in two scams asked cpm leaders to cm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X