హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వైరస్ ఎఫెక్ట్: హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక స్కానర్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా హడలెత్తిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకు వేగంగా వ్యాపిస్తుండటంతో భాతర్ కూడా అప్రమత్తమైంది. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

హాంగ్‌కాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించేందుకు వైద్యులు ప్రత్యేక స్కానర్లు ఏర్పాటు చేశారు. గత మూడు రోజుల నుంచి హాంగ్ కాంగ్ నుంచి హైదరాబాద్ కు రాకపోకలు కొనసాగలేదు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాంగ్ కాంగ్ నుంచి విమానం వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

 High alert in Shamshabad airport: Special scanners for the wake of coronavirus

కాగా, చైనాలోని ఊహాన్ నగరంలో తొలిసారిగా కరోనా వైరస్ బయటపడింది. ఇప్పడు మరో రెండు నగరాలకు కూడా ఇది పాకినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. హాంగ్ కాంగ్ లో నగరంలో కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. చైనాలో ఇప్పటికే ఈ వైరస్ కారణంగా 17 మంది మరణించారు. ప్రాణాంతక వైరస్ బారిన పడి 500 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో ఊహాన్ నగరంలో ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశారు. కరోనా వైరస్ భయంతో పలు అంతర్జాతీయ విమాన సంస్థలు చైనాకు వెళ్లే విమాన సర్వీసులను కూడా రద్దు చేశాయి. పలు దేశాలు ఇప్పుడు చైనా పర్యటనకు కూడా వెళ్లవద్దని సూచనలు చేస్తున్నాయి.

చైనా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. అమెరికాలోని సియాటిల్ లో ఓ కేసు వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కేరళ నర్సుకు కూడా ఈ వైరస్ సోకినట్లు సమాచారం.

చైనా, హాంగ్‌ కాంగ్‌, థాయిలాంగ్‌, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. అమెరికాలోని సియాటిల్‌లో ఒక కేసు వెలుగు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో వైద్యులు తనిఖీలు ముమ్మరం చేశారు. సౌదీలో ఉన్న కేరళ నర్సుకు ఈ వైరస్ సోకడంతో తేలింది.

English summary
High alert in Shamshabad airport: Special scanners for the wake of coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X