వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మియాపూర్ భూములపై తెలంగాణా సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు

|
Google Oneindia TeluguNews

Recommended Video

మియాపూర్ భూములపై... కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు!!

మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మియపూర్ భూములపై సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు స్టే విధించింది. మియపూర్ భూములను యధావిధిగా ఉంచాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టులో కేసు పరిష్కారం అయ్యేంత వరకు మియపూర్ భూములను ప్రభుత్వం కొనడం కానీ ప్రైవేటు వ్యక్తులు ఆమ్మ్మడం కానీ చేయకూడదని తెలిపింది. ఎవరైనా చట్టాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై కోర్టు సానుభూతి చూపదని స్పష్టం చేసింది.

<strong>మంద కృష మాదిగకు పిడమర్తి రవి కౌంటర్..అంబేద్కర్ జయంతికి రానంతమాత్రాన కేసీఆర్ దళిత వ్యతిరేకి అవుతారా?</strong>మంద కృష మాదిగకు పిడమర్తి రవి కౌంటర్..అంబేద్కర్ జయంతికి రానంతమాత్రాన కేసీఆర్ దళిత వ్యతిరేకి అవుతారా?

హైదరాబాద్‌లోని మియాపూర్, బాలానగర్‌ ప్రాంతాలలో సుప్రీం కోర్టులో పెండిగ్‌లో ఉన్న వేల కోట్ల విలువైన భూములను అధికార అండతో, అక్రమ రిజిస్టేషన్లు చేయించి అమ్ముతున్నారంటూ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కొందరు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్లారు.ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్ట్ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర శివారులోని మియపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని తప్పు పట్టింది.

High Court gave shock to Telangana CM KCR on Miyapur lands

రద్దు చేసిన ఉత్తర్వులను వెంటనే నిలిపి వేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చెయ్యటంతో తెలంగాణా ప్రభుత్వానికి చుక్కెదురైంది . సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారమయ్యే వరకు స్టే విధించింది. మియపూర్ భూములను యధావిధిగా ఉంచాలని స్టేటస్‌కో ఆర్డర్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది. చట్టానికి అందరూ సమానమే అని మరొకసారి రుజువు చేసింది తెలంగాణ హైకోర్ట్. తాజాగా వెలువడిన హైకోర్టు ఉత్తర్వులతో ఇప్పుడు మియాపూర్ భూముల విషయంలో యధాతథ స్థితి కొనసాగనుంది.

English summary
The Telangana government has got a shock at the High Court on the Miyapur lands . The High Court has ruled that the state government cancellate the sale deed of land on Miyapur. The court ordered interim orders to retain the cancellation orders. The cases in the Supreme Court stayed until settlement.The High Court ordered the Miyapur lands to be kept as normal. The government said Miyapur land acquisition should not be purchased by the government or private unless the case is settled in court. It is clear that the court is not sympathetic to anyone if they misuse the law .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X