వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు నెలల్లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో మరో ఎన్నికలకు తెరలేవనుంది..గత ఆరునెలలుగా పలు ఎన్నికలతో బిజీగా ఉన్న రాష్ట్ర్రంలో మిగిలి ఉన్న మున్సిపల్ ఎన్నికలకు సైతం త్వరలో రానున్నాయి ..మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 119 రోజుల లోపు ఎన్నికల ప్రక్రియ ముగించాలని చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే వార్డుల విభజనతోపాటు, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పింది.

రాష్ట్ర్రంలో మిగిలి ఉన్న మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది..కాగా ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు మినహా ఇతర ఎన్నికలను ముగించుకున్న ప్రభుత్వం అభివృద్దిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను త్వరగా నిర్ణయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.మున్సిపాలీటిల పాలకవర్గం యొక్క సమయం కూడ జూలైలో ముగియనుండడంతో ఎన్నికలకు సంబంధించి కసరత్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

High Court gave the green signal for the Municipal elections

ఇందుకు సంబంధించి రాష్ట్ట్ర క్యాబినెట్‌లో కూడ చర్చించారు.రాష్ట్ర్ర వ్యాప్తంగా కొత్త మున్సిపాలిటీలు రావడంతో వాటి సంఖ్య 142కు పెరిగినట్టు చెప్పారు. రాష్ట్రంలో కొత్త మున్సిపల్‌ చట్టం తీసుకురావాలని అనుకుంటున్నామని, ఇందుకు అసెంబ్లీలో చట్టం చేయాలా లేక ఆర్డినెన్స్‌ తేవాలా అని ఆలోచిస్తున్నట్టు తెలిపారు. వెంటనే బీసీ రిజర్వేషన్లు, ఇతర రిజర్వేషన్లను పూర్తి చేయాలని మున్సిపల్‌ శాఖ కార్యదర్శిని ఆదేశించినట్టు తెలిపారు.

English summary
The High Court gave the green signal for the Municipal elections. The election was to be completed within 119 days court ordered. including wards and resrvation process will be closed with in days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X