వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ పరిస్థితుల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఆపలేం: హైకోర్టు పచ్చజెండా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపలేమని చెప్పారు. ఈ మేరకు గురువారం హైకోర్టు చెప్పింది. బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వ ఆర్డినెన్స్ నిలిపివేతకు కోర్టు నిరాకరించింది.

అలాగే, దీనిపై కౌంటర్ జారీ చేయాలని కూడా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. అనంతరం విచారణను హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ తెచ్చింది. దీంతో ఎన్నికలు నిలిపివేయాలని కోర్టుకు వెళ్లారు. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆపలేమని కోర్టు తేల్చి చెప్పింది.

3 దశల్లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు, షెడ్యూల్ విడుదల: వివరాలు ఇవీ 3 దశల్లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు, షెడ్యూల్ విడుదల: వివరాలు ఇవీ

High Court green signal for Telangana Panchayat elections

కాగా, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు మంగళవారం షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.

తొలి విడత పోలింగ్ ప్రక్రియ జనవరి 7వ తేదీన ప్రారంభమై 21వ తేదీన ముగుస్తుంది. రెండ విడత పోలింగ్ ప్రక్రియ జనవరి 11వ తేదీన మొదలై 25వ తేదీన ముగుస్తుంది. మూడో విడత పోలింగ్ ప్రక్రియ 16వ తేదీన మొదలై 30వ తేదీన ముగుస్తుంది. పోలింగ్ ఈ నెల 21న, 25న, 30వ తేదీల్లో జరగనుంది. అదే రోజు ఫలితాలు ఉంటాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఆ రోజు నుంచి కోడ్ అమలులోకి వచ్చింది.

English summary
High Court green signal for Telangana Panchayat elections on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X