వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభాస్ భూమి కేసుపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలపై కోర్టు అభ్యంతరం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు ప్రభాస్‌కు హైదరాబాదులోని రాయదుర్గం పాన్ మక్తా గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 46లో భూమి ఉంది. ఈ భూమి రెగ్యులేషన్ కోసం ప్రభాస్ పంపిన అభ్యర్థనను అధికారులు వెనక్కి పంపించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రభాస్ కోర్టుకు వెళ్లారు.

దీనిపై బుధవారం విచారణ జరిగింది. ప్రభాస్ అభ్యర్థనను ఎందుకు వెనక్కి పంపించారని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పూర్తి వివరాలను గురువారం కోర్టు ముందు ఉంచుతామని లాయర్లు పేర్కొన్నారు. అనంతరం గురువారం విచారణ జరిగింది.

తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

ప్రభాస్ పిటిషన్ పైన గురువారం వాదనలు పూర్తయ్యాయి. రాయదుర్గంలోని తన గెస్ట్ హౌస్ సీజ్ చేయడంపై వేసిన ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

 హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీల్ లైఫ్‌లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలికి రియల్ లైఫ్‌లో విలన్లతో తలపడి ఉండరని న్యాయస్థానం పేర్కొంది. సామాన్యుడి విషయంలో అయితే అఫ్పుడే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవాళ్లమని తెలిపింది. ప్రభాస్ విషయంలో ఆచితూచి వ్యవహరించామని పేర్కొంది.

ప్రభాస్‌ను భూకబ్జాదారు అనడంపై అభ్యంతరం

ప్రభాస్‌ను భూకబ్జాదారు అనడంపై అభ్యంతరం

మరోవైపు, విచారణ సందర్భంగా ప్రభాస్ భూకబ్జాదారుడు అని ప్రభుత్వ లాయర్ పేర్కొనడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభాస్‌కు అనుకూలంగా తీర్పు ఉంటే ఆ భూమిని కబ్జా చేసిన వాళ్లు కూడా అర్హులు అవుతారని ప్రభుత్వం తరఫు లాయర్ అన్నారు. అయితే తాము కొనుగోలు చేసిన భూమిలోనే గెస్ట్ హౌస్ కట్టుకున్నాడని ప్రభాస్ లాయర్ చెప్పారు.
భూకబ్జాదారు అయితే సెక్షన్ 17 కింద నోటీసులు ఇవ్వాల్సిందేనని కోర్టు పేర్కొంది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

English summary
High Court intresting comments on Tollywood actor Prabhas land case on Thurday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X