వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిమినల్ కేసులు దాచేసిన కేసిఆర్ !? హైకోర్టు నోటిసులు

|
Google Oneindia TeluguNews

ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ను దాఖలు చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు హైకోర్టు నోటిసులు జారి చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్, ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటీషన్ దాఖలైంది. ఆయనపై 64 క్రిమినల్ కేసులు ఉంటే, మొదటి అఫిడవిట్‌లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటీషన్‌‌లో పేర్కొన్నారు.

high court issued notice to telangana CM Kcr

గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కేసీఆర్‌పై పిటీషన్‌ను దాఖలు చేశారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన ఆయన్ను ఎమ్మెల్యే‌గా అనర్హుడు‌గా ప్రకటించాలని పిటీషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేసీఆర్‌కు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

English summary
high court issued notice to telangana CM Kcr; because wrong affidavit was failed in assembly election about his criminal caces,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X