హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరపడండి: హెల్మెట్‌కు పెరిగిన డిమాండ్, లేకపోతే రూ. 100 ఫైన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

మీరు ద్విచక్ర వాహనాదారాలా? అయితే రేపటి నుంచి హెల్మెట్, లైసెన్స్ తప్పనిసరిగా మీ వెంట తీసుకెళ్లండి. ఎందుకంటే హెల్మెట్, లైసెన్స్ లేకండా వాహనంతో రోడ్డెక్కితే భారీ జరిమానా విధించనున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 2వేలు హెల్మెట్ లేకపోతే రూ. 100 కట్టాల్సిందే.

రోడ్డు భద్రతపై సుప్రీం కమిటీ సూచనలు అమలు పరచాలని రవాణా, పోలీసు శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు వాహనదారులకు హెల్మెట్ ధారణ, లైసెన్స్ తప్పనిసరి అయ్యాయి. బుధవారం నుంచి హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే జరిమానాతోపాటు జైలుశిక్ష విధిస్తున్నారు.

మార్చి 1వ తేదీ నుంచి ప్రత్యేక బృందాలు నగరంలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే రవాణా, పోలీసు అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో తరచూ పట్టుబడే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.

రోడ్డు భద్రత నేపథ్యంలో రెండు శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళుతున్నారు. రోడ్డు భద్రతపై సుప్రీం కమిటీ సూచనలను ఖచ్చితంగా అమలు చేయడంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నిబంధనలు పాటించని వారికి చట్టప్రకారం శిక్ష పడేలా రంగం సిద్ధం చేస్తున్నారు.

హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

మొదటిసారి పట్టుబడితే రెండు రోజులు, రెండోసారి పట్టుబడితే నాలుగు రోజులు జైలు, మూడోసారి పట్టుబడితే జరిమానాతోపాటు వారం రోజులు జైలుశిక్ష విధించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి.

హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 2వేలు, హెల్మెట్ లేకపోతే రూ. 100 జరిమానా కట్టాల్సిందే. మార్చి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించేందుకు ప్రత్యేక బృందాలు తనిఖీలను ముమ్మరం చేశాయి.

 హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

రోడ్డు భద్రతలో భాగంగా రెండు శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళుతున్నారు. నిబంధనలు పాటించని వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా రంగం సిద్ధం చేస్తున్నారు. లైసెన్స్ లేనివారు, ఉండి సస్పెండ్ అయిన వారు వాహనాలు నడిపితే శిక్ష పడేలా చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు.

 హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మూడుసార్లకు మించి పట్టుబడిన వారు గ్రేటర్ పరిధిలో 142 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇలాంటి వారు మళ్లీ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే జైలు శిక్ష విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

హెల్మెట్ తప్పనిసరి అని గత కొన్ని నెలలుగా నగరంలో ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించామని, అయినా చాలామంది పట్టించుకోలేదని హైదరాబాద్ జిల్లా జాయింట్ ట్రాఫిక్ కమిషనర్ టి రఘునాథ్ తెలిపారు.

హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

బుధవారం నుంచి హెల్మెట్ ధరించకుండా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానా విధిస్తామని తెలిపారు. పట్టుబడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.

హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

హెల్మెట్, లైసెన్స్‌తోపాటు ఫోన్ మాట్లాడుతూ, సిగ్నల్ జంపింగ్, మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయడం, ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలపై రెండు శాఖల అధికారులు కఠినంగా వ్యవహరించనున్నారు.

హెల్మెట్‌కు డిమాండ్: మొదైలన తనిఖీలు, లేకపోతే 100 జరిమానా

హెల్మెట్‌కు డిమాండ్: మొదైలన తనిఖీలు, లేకపోతే 100 జరిమానా

హెల్మెట్ తప్పనిసరి అని గత కొన్ని నెలలుగా నగరంలో విసృత్తంగా ప్రచారం చేసి అవగాహన కల్పించామని, అయినా చాలామంది వాడడం లేదని హైదరాబాద్ జిల్లా జేటీసీ టి.రఘనాథ్ తెలిపారు.

హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

హెల్మెట్‌కు డిమాండ్: తనిఖీలు మొదలు లేకపోతే 100 జరిమానా

లైసెన్స్, హెల్మెట్ లేకుండా మద్యం సేవించి వాహనం నడిపితే వారం రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

English summary
High Court makes helmet compulsory for Telangana riders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X