వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీ రహస్యాలు: పాకిస్థానీకి జీవిత ఖైదు సబబే:హైకోర్టు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పర్యాటకుడి ముసుగులో దేశంలోకి వచ్చి రక్షణ శాఖ వివరాలను పాకిస్థాన్‌కు చేర వేస్తున్న ఆ దేశస్తుడికి యావజ్ఝీవ కారాగార శిక్షను హైకోర్టు సమర్ధించింది. తమ దేశానికి రహస్యాలను చేరవేయడం ఒక రకంగా దేశంపై యుద్దం ప్రకటించడమేనని హైకోర్టు అభిప్రాయపడింది.

పర్యాటకుడి రూపంలో ఇండియాకు వచ్చి ఇక్కడి కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఆదే శానికి చెందిన ఆషికి అలీకి జీవిత ఖైదు విధించడాన్ని హైకోర్టు సమర్దించింది.

ఈ కేసులో అరెస్టైన అషికీ అలీకి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ 2011లో హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ విషయమై హైకోర్టు నిజామాబాద్ కోర్టు విధించిన జీవిత ఖైదును సమర్ధించింది.

పర్యాటకుడి ముసుగులో రహస్యాల లీక్

పర్యాటకుడి ముసుగులో రహస్యాల లీక్

పాకిస్తాన్‌కు చెందిన ఆషికి అలీ డిల్లీ, కాన్పూర్ లలో పర్యాటక ప్రాంతాల పేరుతో 2001లో ఇండియాకు వచ్చాడు.ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించాడు. దేశంలోని కీలకమైన రక్షణ శాఖ సమాచారాన్ని సేకరించాడు.సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు చెందిన ఆర్మీ సమాచారాన్ని సేకరించి పాక్ కు ఈ మెయిల్ ద్వారా చేరవేసేవాడు.

నిజామాబాద్ లో అలీ అరెస్ట్

నిజామాబాద్ లో అలీ అరెస్ట్


పాక్ కు చెందిన అషికి అలీ ఇండియాకు చెందిన రక్షణ శాఖ రహస్యాలను పాక్ కు చేరవేస్తున్నాడని నిఘా వర్గాలు గుర్తించాయి అయితే ఆ సమయంలో అలీ నిజామాబాద్ జిల్లాలో ఉన్నాడు. దీంతో 2002 లో నిజామాబాద్ లో అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. అలీపై ఐపీసీతో పాటు విదేశీయుల చట్టం, అధికార రహస్యాల చట్టం కింద కేసులు నమోదు చేశారు.

జీవిత ఖైదు

జీవిత ఖైదు

ఈ కేసు విచారణ చేసిన నిజామాబాద్ రెండో అదనపు సెషన్స్ న్యాయమూర్తి 2004లో ఆషికి అలీకి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.ఆషికీని ఐపీసీ, విదేశీయుల కు అధికార రహస్యాల చట్టం వర్తించదని తన తీర్పులో కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఆషికి అలీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాడు.

జీవిత ఖైదు కరెక్టే

జీవిత ఖైదు కరెక్టే

విదేశీయులకు అధికారిక రహస్యాల చట్టం వర్తించదని నిజామాబాద్ కోర్టు అభిప్రాయపడినందున తనపై నమోదైన అభియోగాలు కూడ వర్తించవని కోరుతూ 2011లో ఆషికి అలీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విషయమై జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.నిజామాబాద్ కోర్టు విధించిన జీవిత ఖైదును కోర్టు సమర్దించింది. అధికారిక రహస్యాల చట్టం వర్తించదని నిజామాబాద్ కోర్టు తీర్పు చెప్పడాన్ని తప్పుబట్టింది. రక్షణ శాఖ రహస్యాలు చేరవేయడం దేశంపై యుద్దం చేయడమేనని కోర్టు ప్రకటించింది.

English summary
The Telangana high court ordered to Ashiqui ali life sentence for spying indian Army secrets to Pakistan.High court supported Nizamabad court verdict in 2004.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X