వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్రటేరియట్ నిర్మాణంపై తెలంగాణా సర్కార్ కు హై కోర్ట్ షాక్ .. ఎందుకు కడుతున్నారో చెప్పండి ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

సెక్రటేరియట్ నిర్మాణంపై రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ప్రశ్నలు| High Court Asked Number Of Questions Ts

టీఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సెక్రటేరియట్ , అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించి వాటి నిర్మాణానికి శ్రీ కారం చుట్టారు. అయితే ఇది ప్రజాధనం దుర్వినియోగమే అని ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ భవనాల కోసం కొత్త నిర్మాణాలు చేపట్టాలన్న తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిల్‌పై నిన్న విచారణ జరిగింది. అంతే కాదు హైకోర్టు ధర్మాసనం తెలంగాణా సర్కార్ ను పలు సూటి ప్రశ్నలు అడిగింది.

బొండా ఉమాకు హై కోర్టు షాక్ .. ఆ పిటీషన్ విచారణార్హం కాదని కొట్టేసిన కోర్టుబొండా ఉమాకు హై కోర్టు షాక్ .. ఆ పిటీషన్ విచారణార్హం కాదని కొట్టేసిన కోర్టు

సెక్రటేరియట్ నిర్మాణంపై రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ప్రశ్నల బాణాలు

సెక్రటేరియట్ నిర్మాణంపై రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ప్రశ్నల బాణాలు

ఇప్పటికే వినియోగంలో వుండి, ఇంకా వినియోగించుకోవడానికి వీలుగా ఉన్న నిర్మాణాలను వదిలేసి వాటికి బదులుగా కొత్తవి నిర్మించాల్సిన అవసరం ఏముందని ఈ సందర్భంగా హై కోర్టు తెలంగాణ సర్కార్‌ని ప్రశ్నించింది. అంతే కాదు ‘వందేండ్లు నిండిన బిల్డింగ్​లోనే హైకోర్టు కార్యకలాపాలు సాగుతున్నాయి. నిర్వహణ బాగున్నప్పుడు కొత్త హైకోర్టు నిర్మించాల్సిన అవసరం ఉంటుందా? అని ప్రశ్నించింది. సమైక్య రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇప్పుడా సంఖ్య 119కి తగ్గింది.ఇప్పుడున్న భవనం విశాలంగా ఉంది. సౌకర్యాలు చూసుకున్నా బాగానే ఉన్నాయి కదా మరి అలాంటప్పుడు కొత్త అసెంబ్లీ ఎందుకు? అని అడిగింది. అసలు ప్లాన్​ సిద్ధం కాకముందే భూమిపూజ ఎలా చేశారు?" అంటూ రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ప్రశ్నల బాణాలు ఎక్కు పెట్టింది.

కూల్చటానికి కారణం చెప్పాలన్న కోర్టు .. సమగ్ర వివరాలివ్వాలని ఆదేశం

కూల్చటానికి కారణం చెప్పాలన్న కోర్టు .. సమగ్ర వివరాలివ్వాలని ఆదేశం

ఇప్పుడున్న అసెంబ్లీ, కొత్తగా ఎక్కడ కట్టబోయేది, ఆ ప్రాంతం గూగుల్​ మ్యాప్ లు, డిజైన్లు, ప్లాన్లు.. సమగ్ర వివరాల్ని అందజేయాలని ఆదేశించింది.ఎర్రమంజిల్ భవనం, హెరిటేజ్ భవనాన్ని కూల్చడానికి సరైన కారణాలు ఏంటని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలపై ప్రభుత్వం వద్ద ఉన్న ప్లాన్స్ , నూతన భవనాల నిర్మాణ అవసరాలపై వివరాలు అందించాలని కోర్టు తెలంగాణ సర్కార్‌కి ఆదేశాలు జారీచేసింది. పాత భవనాల్ని కూల్చివేయకుండా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి షమీమ్‌‌ అక్తర్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం విచారించింది. కూల్చివేతపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు బెంచ్​ నిరాకరించింది.

 సచివాలయ కూల్చివేతపై దాఖలైన పిటీషన్లు .. రేవంత్ రెడ్డి పిటీషన్ జులై 8న విచారణ

సచివాలయ కూల్చివేతపై దాఖలైన పిటీషన్లు .. రేవంత్ రెడ్డి పిటీషన్ జులై 8న విచారణ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టి.జీవన్‌రెడ్డి, న్యాయవాది టి.రజనీకాంత్‌ రెడ్డి, గుడ్‌ గవర్నెన్స్​ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డిలు వేరువేరుగా సచివాలయ కూల్చివేతపై పిల్స్‌ దాఖలు చేశారు. వీటన్నింటిపై తుది విచారణ ఆగస్టు చివరి వారంలో ఉంటుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ శుక్రవారం ప్రకటించింది. సచివాలయ భవనాల కూల్చివేసి వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలన్న తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రస్తుతం వినియోగంలో వున్న భవనాలు మరో 50-70 ఏళ్ల వరకు పటిష్ఠంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అలాంటి భవనాలను కూల్చి నూతన భవనాలు నిర్మించాలనుకోవడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని రేవంత్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 8న విచారిస్తామని వెల్లడించింది.

English summary
TRS chief Telangana CM Kalvakuntla Chandrashekhara Rao was laid stone and performed earth pooja for secretariat and assembly buildings. Oppositions, however, resorted to court, saying it was a misuse of public funds.The PIL filed in the High Court yesterday challenged Telangana Sarkar's decision to construct new structures for Telangana Secretariat and Assembly Buildings. Moreover, the High Court has asked Telangana Sarkar a number of straightforward questions. The court has questioned the government as to the reasons for the demolition of Telangana Secretariat and Assembly buildings. The court has instructed the Telangana Sarkar to provide details on the government's plans for assembly and secretariat construction and the construction requirements of the new buildings
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X