వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు మళ్లీ స్టే: ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్‌పై వాడీవేడీగా వాదనలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ (గురువారం) కూడా ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిజిటర్ జనరల్, పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం తమ విచారణ జరిగే వరకు కూల్చివేతపై స్టే కొనసాగుతోందని ధర్మాసనం తెలిపింది.

ఏజీ-పిటిషనర్ వాదనలు

ఏజీ-పిటిషనర్ వాదనలు


భవనాల కూల్చివేతకు కేంద్ర పర్యావరణ అనుమతులు అవసరమా కాదో తెలపాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ధర్మాసనం వివరాలు అడిగింది. భవనాల కూల్చివేతకు ఎన్విరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ అనుమతి అవసరం లేదని ఏజీ తెలిపారు. దానికి సంబంధించి ఇదివరకటి ఎన్విరాన్‌మెంట్ రెగ్యులెటరీ యాక్ట్ క్లియరెన్స్‌ జడ్జ్‌మెంట్‌లను హైకోర్టుకు సమర్పించామన్నారు. ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్‌లో కూల్చివేత వస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2018కి విరుద్దంగా కూల్చివేత పనులు చేపడుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

కూల్చివేతకు అవసరం లేదు

కూల్చివేతకు అవసరం లేదు

ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి లీగల్ రీజర్వ్‌మెంట్స్ తీసుకోవాని.. కూల్చివేతకు అవసరం లేదని ప్రభుత్వం చెప్పిందని ఏజీ అన్నారు. దీంతో ధర్మాసనం కల్పించుకొని.. కేంద్ర పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఏం చెబుతుందో తెలియాజేయాలని ఏజీని ధర్మాసనం అడిగింది. సచివాలయ భవనాల కూల్చివేత అంశం కేంద్రప్రభుత్వం పరిధిలో అని అంశం అని హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్విరాన్‌మెంట్స్ ప్రోటక్షన్ యాక్ట్ ప్రకారం భవనాలు కూల్చివేయాలంటే భారత ప్రభుత్వం రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఎన్విరాన్‌మెంట్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా అనుమతులపై తుది నిర్ణయం వెల్లడించాకే తుది ప్రకటన ఇస్తామని హైకోర్టు తెలిపింది.

శుక్రవారానికి వాయిదా

శుక్రవారానికి వాయిదా

భవనాల కూల్చివేతకు అనుమతి అవసరం లేదు అని.. కొత్త భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి అవసరమని ఏజీ వాదించారు. నూతన నిర్మాణాలు చేపట్టే క్రమంలో అన్ని అనుమతులు తీసుకుంటామ‌ని హైకోర్టుకు తెలిపారు. జీహెచ్ఎంసీ, లోకల్ అథారిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతులు సరిపోతాయని వివరించారు. వాదనలు పూర్తయ్యాక శుక్రవారానికి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

English summary
high court stay on secretariat building collapse petition.no need environment regulatory act clearance for secretariat building collapse ag told to court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X