హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొంత నిరాశే, కానీ: చార్మి పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇలా

డ్రగ్స్ కేసులో తనకు నోటీసులివ్వడంపై సినీ నటి చార్మి వేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారంతీర్పు వెలువరించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తనకు నోటీసులివ్వడంపై సినీ నటి చార్మి వేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో చార్మికి కొంత ఊరట లభించినప్పటికీ.. కొంత నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది.

సత్యహరిశ్చంద్రులా?: చార్మి పిటిషన్‌పై ఆమె, ఎక్సైజ్ తరపు లాయర్ల పోటాపోటీ వాదనలుసత్యహరిశ్చంద్రులా?: చార్మి పిటిషన్‌పై ఆమె, ఎక్సైజ్ తరపు లాయర్ల పోటాపోటీ వాదనలు

చార్మి విచారణను మహిళా అధికారులతోనే జరిపించాలని కోర్టు.. సిట్ ను ఆదేశించింది. చార్మి అంగీకారం లేకుండా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవద్దని స్పష్టం చేసింది. విచారణను ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే కొనసాగించాలని పేర్కొంది.

High Court Verdict on Charmy's petition

ఇది సిట్‌కు కొంత నిరాశ కలిగించే అంశంగా తెలుస్తోంది. కాగా, విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని సిట్‌ను కోర్టు ఆదేశించింది. అయితే, చార్మి కోరినట్లుగా తన విచారణ సమయంలో తన అడ్వొకేట్ కూడా ఉండాలన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇది చార్మికి నిరాశ కలిగించే అంశమే.

నా పరువు తీశారు, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవద్దు: సిట్‌పై హైకోర్టుకు చార్మినా పరువు తీశారు, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవద్దు: సిట్‌పై హైకోర్టుకు చార్మి

కాగా, జులై 26న బుధవారంనాడు చార్మిని సిట్ విచారించనుంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో చార్మిని మహిళా అధికారులే విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నిపుణులైన మహిళా అధికారుల కోసం వేట ప్రారంభించారు. సిట్ విచారణలో పూరీ, కెల్విన్‌తో సంబంధాలపై చార్మీని ఆరా తీసే అవకాశం ఉంది. కాగా, విచారణ వేదికను మార్చుకునే అవకాశం లేదని, సిట్ ఆఫీసుకు వస్తానని చార్మి ఇప్పటికే చెప్పారని ప్రభుత్వ లాయర్ తెలిపారు.

English summary
High Court rejected heroine Charmee's plea to quesion her in the presence of her advocate in drugs case by the excise SIT.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X