వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉసురుతీసిన హై ఓల్టేజీ .. కరెంట్ స్తంభాలకు విద్యుత్ సప్లై ... ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

|
Google Oneindia TeluguNews

వికారాబాద్ : మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు శాపమవుతాయి. కాస్త అజాగ్రత్త ప్రాణాలమీదికి తీసుకొస్తాయి. అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లా కంసన్ పల్లిలో ఒకరి మరణానికి కారణమైంది. గాయపడ్డ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గ్రామానికి కరెంట్ షాక్ ..
వికారాబాద్ జిల్లా జహీరాబాద్ మండలం కంసన్ పల్లిలో కరెంట్ షాక్ తగిలింది. ఊళ్లోని స్తంభాలన్నింటికీ హై ఓల్టేజ్ విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో గ్రామంలోని ట్రాన్స్ ఫార్మర్లతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. ఆ సమయంలో కరెంట్ పనిచేస్తున్న ఓ వ్యక్తి తీవ్రగాయాలై చనిపోయాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. కంసన్ పల్లిలో ఇదివరకు కూడా ఓ సారి కరెంట్ షాక్ తగిలి .. తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. దీనిపై స్థానికులు విద్యుత్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో గ్రామంలో మళ్లీ కరెంట్ షాక్ కొట్టింది. ఈ సారి విద్యుత్ ఉపకరణాలు బుగ్గి అవడంతోపాటు ప్రాణనష్టం కూడా జరగడం ఆందోళన కలిగిస్తోంది.

high voitage current shock in village .. one die, two injured

పకడ్బందీ చర్యలు తీసుకోండి
ఇకనైనా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో జరిగిన నష్టం కళ్ల ముందు కదలాడుతుంటే .. మరోసారి ప్రమాదం జరగడం కలచివేస్తుందని చెప్తున్నారు. భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా పటిష్టంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
In that village electricity officers neglency one man dead another two injured. vikarabad dist kansanpalli .. village has current shock. previous also same thing .. but right now some valuble things fire and .. one death another two injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X