వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంథని మధుకర్ రీపోస్టుమార్టమ్: ఫోరెన్సిక్ బృందాన్ని పంపించాలన్న హైకోర్టు..

పిటిషన్ తో ఏకీభవించిన హైకోర్టు ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించేందుకు అనుమతినిచ్చింది.

|
Google Oneindia TeluguNews

మంథని: శుక్రవారం హనుమకొండలోని కాకతీయ ఆసుపత్రిలో మంథని మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టమ్ నిర్వహించనున్న నేపథ్యంలో.. ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌తో ఏకీభవించిన హైకోర్టు ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించేందుకు అనుమతినిచ్చింది.

రీపోస్టు మార్టమ్ అనంతరం నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాల్సిందిగా ప్రత్యేక వైద్య బృందాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, తొలుత నిర్ణయించినట్లుగా కాకుండా మధుకర్ మృతిచెందిన ప్రదేశంలోనే రీపోస్టుమార్టమ్ జరపాలని కోర్టు ఆదేశించినట్లుగా సమాచారం.

<strong>కేసీఆర్‌కు మంథని దెబ్బ:మూడెకరాలు పోయి ఆరడగుల జాగనా?, 'మధుకర్' ఘటనపై పెల్లుబికిన ఆగ్రహం</strong>కేసీఆర్‌కు మంథని దెబ్బ:మూడెకరాలు పోయి ఆరడగుల జాగనా?, 'మధుకర్' ఘటనపై పెల్లుబికిన ఆగ్రహం

ఉస్మానియా వైద్య బృందం ఫోరెన్సిక్ అండ్ కాకతీయ మెడికల్ సిబ్బందితో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో రీపోస్టుమార్టమ్ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

Highcourt orders to send special forensic doctors team for manthani madhukar re postmartem

ఇదిలా ఉంటే, మంథని మధుకర్ అనుమానస్పద మృతి కేసులో విచారణను పక్కదోవ పట్టించారన్న ఆరోపణలున్నాయి. ఇందులో స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు పాత్రపై కూడా అనుమానాలు రేకెత్తడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది.

కేసును పక్కదోవ పట్టించి దళిత కుటుంబంపై స్థానిక సీఐ జులుం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 48దళిత సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు మంథనిలో మెరుపు ధర్నా నిర్వహించాయి. దీంతో పోలీసులు దిగిరాక తప్పలేదు. సీఐపై వేటు వేసి ఆయన స్థానంలో కొత్త నటేష్ ను నియమించారు. అలాగే కేసు బాధ్యతలను ఏసీపీ సింధుశర్మ స్వీకరించారు.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు మంథని మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు. అయితే రీపోస్టుమార్టమ్ విచారణ పారదర్శకంగా జరగాలంటే ఫోరెన్సిక్ వైద్య బృందంతో పాటు, మెజిస్ట్రేట్, కుటుంబ సభ్యుల సమక్షంలో వీడియో రికార్డింగ్ సహకారంతో రీపోస్టుమార్టమ్ నిర్వహించాలని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. సానుకూలంగా స్పందించిన కోర్టు ఫోరెన్సిక్ వైద్య బృందాన్ని మంథనికి పంపించేందుకు అనుమతినిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

కుటుంబ సభ్యుల మధ్యే రీపోస్టు మార్టమ్ నిర్వహించాలని పిటిషన్ లో అభ్యర్థించారు. తెలంగాణ ప్రభుత్వం, ఫోరెన్సిక్ నిపుణులు, మెజిస్ట్రేట్ సమక్షంలో, వీడియో రికార్డింగ్ తో చేయాలి. వాస్తవాలకు దూరంగా అధికారుల విచారణతో చేయించింది. రీపోస్టుమార్టమ్ తో నిజాలు బయటపపడుతాయని నమ్మకం. పోస్టుమార్టమ్ లో వాస్తవాలు మాయం.

English summary
Highcourt orders to send special forensic doctors team for manthani madhukar re postmartem
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X