గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మా నా చివరి కోరిక తీర్చు అంటూ తండ్రి అలా....తండ్రి కోసం కూతురిలా..

అమ్మా...నాకు ఏమైనా నీవు అధైర్యపడకూడదు, నీ ఫోటో నేను స్కూల్ నోటీసు బోర్డులో చూడాలన్న తండ్రి కోరికను తీర్చేందుకు ఆ కూతురు తాపత్రయపడుతోంది.తండ్రి అంత్యక్రియలకు హజరుకాకుండా తల్లికి ధైర్య చెప్పింది.తండ్రి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమ్మా...నాకు ఏమైనా నీవు అధైర్యపడకూడదు, నీ ఫోటో నేను స్కూల్ నోటీసు బోర్డులో చూడాలన్న తండ్రి కోరికను తీర్చేందుకు ఆ కూతురు తాపత్రయపడుతోంది.తండ్రి అంత్యక్రియలకు హజరుకాకుండా తల్లికి ధైర్య చెప్పింది.తండ్రి కోరికను తీర్చేందుకు ఆ కూతురు పడుతున్న తపన అంతా ఇంతా కాదు.

గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలోని కొల్లూరు గ్రామానికి చెందిన లంకా శివనాగ పూర్ణచంద్రరావు, కనకదుర్గ భార్యభర్తలు.13 ఏళ్ళ క్రితం వారు బతుకుదెరువు కోసం హైద్రాబాద్ కు వచ్చారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్ నగర్ డివిజన్ ఎస్ఆర్ నాయక్ నగర్ లోని జనప్రియ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు.

exams

ఈ దంపతులకు భరత్, హిమబిందు అనే ఇద్దరు పిల్లలున్నారు.పూర్ణచంద్రరావు మార్కెటింగ్ విభాగంలో పనిచేసి కొండాపూర్ లోని కిమ్స్ ఆసుపత్రిలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు.అతడి భార్య కూడ అదే ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది.

భరత్ గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీ ఐఐటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. హిమబిందు ఎస్ఆర్ నాయక్ నగర్ లోని సత్యవాణి హైస్కూల్ లో పదో తరగతి చదువుతోంది.తండ్రితో ఎంతో అన్యోన్యంగా ఉండే హిమబిందుకు ఈ విషయం చెప్పకుండా కొంతకాలంపాటు దాచారు.

అయితే పూర్ణచంద్రరావు ఇటీవలే తన కూతురుకు అసలు విషయం చెప్పాడు. నా చావు దగ్గరపడింది. నీవు అధైర్యపడకుండా పరీక్షలు రాయాలని ఆయన ధైర్యం చెప్పాడు.స్కూల్ నోటీసు బోర్డులో కూతురు పేరు టాప్ మార్కులతో కన్పించాలనే కోరికను వ్యక్తం చేశాడు.

మల్లంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో హిమబిందు పరీక్షలు రాస్తోంది. శుక్రవారం నాడు హిమబిందు తండ్రి చనిపోయాడు.అయితే అప్పటికే ఆమె ఫిజిక్స్ పరీక్ష రాసింది.

అయితే మృతదేహన్ని అంత్యక్రియల కోసం తెనాలికి తరలించారు. శనివారం నాడు అంత్యక్రియలను నిర్వహించారు. అయితే చిన్నారి ఈ అంత్యక్రియలకు హజరుకాలేదు.అయితే ఈ అంత్యక్రియలకు హజరుకాలేక తీవ్రంగా ఇబ్బందిపడింది.

పిన్ని ఇంట్లో ఉంటూనే శనివారం నాడు ఆమె పరీక్షలు రాసింది. సోమవారం నాడు మరోపరీక్ష రాసింది. పాఠశాల ఉపాధ్యాయులు ఆమెకు సపోర్ట్ గా నిలిచారు.

తాను జీవితంలో డాక్టర్ గా కావాలనే ఆమె అభిప్రాయపడుతోంది.సోమవారం నాడు పరీక్షరాసిన హిమబిందు తల్లికి ఫోన్ చేసి పరీక్ష బాగా రాసినట్టు చెప్పింది. అమ్మా పరీక్ష బాగా రాశావని, నీవు ధైర్యంగా ఉండాలని చెప్పారు.

English summary
himabindu wrote 10th class exams for her father final wish.recently himabindu father died ,she didn't went to her father final rits for exams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X