వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో షాక్: గజల్ శ్రీనివాస్‌పై వేటు, 20వీడియోలు, వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, నన్నపనేని ఆశ్చర్యం

|
Google Oneindia TeluguNews

Recommended Video

గజల్ శ్రీనివాస్‌పై వేటు: వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, 20 వీడియోలు

హైదరాబాద్/అమరావతి: మహిళా రేడియో జాకీపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌కు మరో షాక్ తగిలింది. గజల్ శ్రీనివాస్‌ను సేవ్‌టెంపుల్స్‌ సంస్థ ప్రచారకర్త బాధ్యతల నుంచి తొలగించారు.

గజల్ శ్రీనివాస్ నీచుడు, గదిలో నగ్నంగా: బాధితురాలు కన్నీటిపర్యంతం గజల్ శ్రీనివాస్ నీచుడు, గదిలో నగ్నంగా: బాధితురాలు కన్నీటిపర్యంతం

ఈ మేరకు గ్లోబల్‌ హిందూ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాశ్‌రావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస్‌ను తమ సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. కాగా, మరికొన్ని సంస్థలు కూడా గజల్ శ్రీనివాస్‌ను తమ సంస్థల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాయి.

గజల్ శ్రీనివాస్‌ను తొలగించాం

గజల్ శ్రీనివాస్‌ను తొలగించాం

‘సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటైన ఈ సంస్థ పలువురు ఎన్నారైల సహకారంతో 2006లో ఏర్పాటైంది. మా సిద్ధాంతాల ప్రకారం.. ఇల్లు, సమాజంలో మహిళలకు అత్యున్నత గౌరవం ఉంటుంది. భారత్‌లోని మా కార్యాలయంలో లైంగిక వేధింపులు జరిగాయనే సమాచారం దిగ్భ్రాంతికి గురిచేసింది. అధికార దుర్వినియోగం, నైతిక విలువలకు విఘాతం కలిగించడాన్ని గ్లోబల్‌ హిందూ హెరిటేజ్‌ ఫౌండేషన్‌, సేవ్‌ టెంపుల్స్‌ సంస్థ ఎట్టి పరిస్థితుల్లో సహించవు. మా మహిళా ఉద్యోగుల్లో ఒకరిని లైంగికంగా వేధించారనే ఆరోపణలపై గజల్‌ శ్రీనివాస్‌పై కేసు నమోదు అయినందున.. ఆయన్ను తక్షణమే సంస్పెండ్‌ చేయాలని మా సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు' అని వెలగపూడి ప్రకాశ్‌రావు తెలిపారు.

పోలీసులకు 20వీడియోలు

పోలీసులకు 20వీడియోలు

సేవ్‌ టెంపుల్స్‌ సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించిన కేసులో గజల్‌ శ్రీనివాస్‌ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం జనవరి 12 వరకు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్‌ లైంగిక వేధింపులు, వికృత చేష్టలకు సంబంధించిన 20 వీడియోలను బాధితురాలు పోలీసులకు అందజేసింది. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

గజల్‌ను వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి

గజల్‌ను వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి


కాగా, లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన గజల్ శ్రీనివాస్‌ను ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు వెనుకేసుకు రావడం గమనార్హం. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచి గజల్ శ్రీనివాస్ బాగా తెలుసని, అతను అలాంటివాడు కాదని అన్నారు. అతను ఏ తప్పూ చేయలేదని అనుకుంటున్నానని, అతనిపై కావాలనే కుట్ర చేశారని భావిస్తున్నానని అన్నారు. శ్రీనివాస్ చాలా చక్కగా కమ్మని పాటలు పాడతాడని, ప్రపంచ వ్యాప్తంగా గజల్స్ వినిపించాడని తెలిపారు.

అమ్మాయిలను వేధించే వాడు కాదు.. వీడియోలు చూసి..

అమ్మాయిలను వేధించే వాడు కాదు.. వీడియోలు చూసి..

గజల్ శ్రీనివాస్‌ది అమ్మాయిలను వేధించే నైజం కాదని మంత్రి మాణిక్యాల రావు అన్నారు. పథకం ప్రకారం చేయకుంటే వీడియోలు బయటకు ఎలా వస్తాయని మంత్రి ప్రశ్నించారు. కాగా, గజల్ శ్రీనివాస్‌కు సంబంధించిన వికృత వీడియోలను చూసిన తర్వాత మంత్రి మాణిక్యాలరావు స్పందన వేరే విధంగా ఉంది. తాను గజల్ శ్రీనివాస్ వికృత వీడియోలు చూశానని, ఇలాంటి వ్యక్తులకు తన మద్దతు ఉండదని, అతడ్ని శిక్షించాల్సిందేనని అన్నారు.

గజల్ శ్రీనివాస్ ఇలాంటివాడా? బాధితురాలికి నన్నపనేని మద్దతు

గజల్ శ్రీనివాస్ ఇలాంటివాడా? బాధితురాలికి నన్నపనేని మద్దతు

కాగా, గజల్ శ్రీనివాస్ బాధితురాలికి ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ధైర్యం చెప్పారు. ఓ న్యూస్ ఛానెల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఫోన్లో మాట్లాడారు. ‘గజల్' ఘోరాన్ని బయటపెట్టిన బాధితురాలు భయపడాల్సిన పనిలేదని, పోలీసులు, మీడియా, మహిళా కమిషన్లు అండగా ఉంటాయని ధైర్యం చెప్పారు. ‘గజల్' ఘటనలో సాక్ష్యాధారాలు లేకపోతే నమ్మేవాళ్లం కాదని, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే నమ్ముతున్నామని అన్నారు. ‘అమ్మ', ‘మహిళ'ల మీద అద్భుతమైన గజల్స్ పాడే శ్రీనివాస్, ఇంతదారుణానికి ఒడిగట్టాడా? అని నన్నపనేని రాజకుమారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

English summary
Global Hindu Heritage Foundation and Save Temples Organisation have suspended Telugu singer Ghazal Srinivas as their brand ambassador following his arrest on charges of sexually harassing one of the women employees at its India office in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X