వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: వేడుకలకు సిద్ధం, పది ముఖ్యమైన పాయింట్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

తెలంగాణ ఆవిర్భావం గురించి తెలుసుకుందామా??

హైదరాబాద్: జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ప్రభుత్వం దీనిని ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. తెలంగాణవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు (1-3 తేదీ వరకు జూన్-2018) సంబరాలు నిర్వహించాలని కేసీఆర్ ఢిల్లీలోని అధికారులను ఆదేశించారు. జూన్ 2న వేడుకలు అంబరాన్ని అంటుతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కొన్ని కీలక అంశాలు.

- 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రలో తెలంగాణ విలీనమైంది. పెద్దమనుషుల ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.

- పెద్దమనుషుల ఒప్పందాన్ని ఆంధ్రా పాలకులు తుంగలో తొక్కడంతో 1969లో తొలిసారి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఉద్యమం తొలుత ప్రారంభమైంది. అది మిగతా ప్రాంతాలకు పాకింది. 1969లో జరిగిన ఉద్యమంలో 369 విద్యార్థులు అమరులయ్యారు.

- 1998లో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో ముందుకు వచ్చింది.

History of Telangana explained in 10 points

- 27 ఏప్రిల్ 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 26 అసెంబ్లీ, 5 లోకసభ స్థానాల్లో గెలిచింది. 2006లో కేసీఆర్ యూపీఏకీ మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. 2008లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. కానీ ఉప ఎన్నికల్లో సత్తా చాటలేకపోయారు.

- 10 అక్టోబర్ 2008లో చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చారు. 2009లో టీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ చేశాయి.

- 9 డిసెంబర్ 2009 యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ప్రకటన చేసింది. ఇందుకోసం కేసీఆర్ దీక్ష చేశారు. ఆ తర్వాత ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. దీంతో 23 డిసెంబర్ 2009న యూపీఏ తన ప్రకటనను వెనక్కి తీసుకుంది.

- 24 డిసెంబర్ 2009న కోదండరాం నేతృత్వంలో తెలంగాణ జేఏసీ ఆవిర్భవించింది. మరోవైపు తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.

- తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో 13 సెప్టెంబర్ 2011న సకల జనుల సమ్మె నిర్వహించారు. 42 రోజుల పాటు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్, సడక్ బంద్, రైల్వే రోకో తదితర కార్యక్రమాలను నిర్వహించారు.

History of Telangana explained in 10 points

- 30 జూలై 2014న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 5 డిసెంబర్ 2013న తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

- పార్లమెంటు 18 ఫిబ్రవరి 2014లో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎంపీ లగడపాటి రాజగోపాల్ లోకసభలో పెప్పర్ స్ప్రే చల్లారు. 2 జూన్ 2014న తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. కేసీఆర్ తెలంగాణ తొలి సీఎంగా జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు.

History of Telangana explained in 10 points
English summary
In 2013, the UPA government headed by Manmohan Singh clears the formation of Telangana. On June 2, 2104, K Chandrasekhar Rao takes oath as the first chief minister of Telangana, India's 29th state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X