హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లో దుస్తుల్లో బ్లూటూత్: హైటెక్ కాపీయింగ్, పట్టుబడ్డ హైదరాబాదీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో హైటెక్ కాపీయింగ్ గుట్టు రట్టయింది. 'జెన్‌కో'లో ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షలో అత్యాధునికి సాంకేతిక పరికరాల సాయంతో కాపీయింగ్‌కు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, రామాంతాపూర్‌లోని డిగ్రీ కాలేజీలో శనివారం జరిగిన జెన్‌కో ఇంజినీరింగ్ పరీక్షకు అంబర్‌పేటకుచెందిన జీ అంజిబాబు హాజరయ్యాడు.

Hitech copying in hyderabad genco exam

లో దుస్తుల్లో బ్లూటూత్ పెట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత దాని సాయంతో ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటుండగా, అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులకు కేసు నమోదు చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు.

విద్యుదాఘాతంతో తండ్రీ కొడుకులు మృతి

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో తండ్రీ కోడుకులు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లందులోని గోవింద్ సెంటర్ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, స్థానికంగా నివాసముంటున్న సత్యనారాయణ(40) చికెన్ సెంటర్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఆదివారం కావడంతో తనతో పాటు కొడుకు సందీప్(18)ను దుకాణానికి వెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలో దుకాణంలో ఉన్న బాయిలర్ ఆన్ చేయడానికి వెళ్లిన సందీప్‌కు షాక్ కొట్టడంతో అతన్ని రక్షించేందుకు వెళ్లిన సత్యనారాయణకు కూడా షాక్ తగిలడంతో అక్కడికక్కడే మృతిచెందారు.

English summary
Hitech copying in hyderabad genco exam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X