వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతుందా?: షాకిచ్చిన అనుచరులు, రేవంత్ దూకుడుకు కాంగ్రెస్ ఝలక్

వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. రేవంత్ వరుసగా పలువురు నేతలను కలుస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. రేవంత్ వరుసగా పలువురు నేతలను కలుస్తున్నారు.

ఆ తర్వాతే రేవంత్‌కు పదవి, వ్యూహం మార్చిన కాంగ్రెస్: రేణుకా చౌదరితో భేటీఆ తర్వాతే రేవంత్‌కు పదవి, వ్యూహం మార్చిన కాంగ్రెస్: రేణుకా చౌదరితో భేటీ

ఇందులో భాగంగా పార్టీలో చేరకముందే డీకే అరుణ వంటి నేతలను కలిశారు. ఆ తర్వాత రేణుకా చౌదరి, సబితా ఇంద్రారెడ్డి, ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్యలను కలుస్తున్నారు. పార్టీలో అందరి మద్దతు కూడబెట్టుకునేందుకు ఆయన కలుస్తున్నారు.

Recommended Video

Big Shock To Revanth Reddy రేవంత్‌కు బిగ్ షాక్ | Oneindia Telugu

ఉదయం రేవంత్, సాయంత్రం మంత్రితో టీడీపీ కంచర్ల చర్చలు! ఆ నేత డైలమాఉదయం రేవంత్, సాయంత్రం మంత్రితో టీడీపీ కంచర్ల చర్చలు! ఆ నేత డైలమా

అప్పుడే సవాల్‌కు కాంగ్రెస్ సిద్ధంగా లేదా

అప్పుడే సవాల్‌కు కాంగ్రెస్ సిద్ధంగా లేదా

రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాను సమర్పించారు. దానిని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ స్పీకర్‌కు పంపించాల్సి ఉంది. తెలంగాణ స్పీకర్ వద్దకు వస్తే ఆయన ఆ రాజీనామా పత్రాన్ని వెంటనే ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పుడే తమ సత్తా నిరూపించుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.

రేవంత్‌కు దూరంగా సన్నిహితులు

రేవంత్‌కు దూరంగా సన్నిహితులు

ఇటీవల రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పలువురు నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించకుండా ఉప ఎన్నికలపై దూకుడుగా వ్యవహరించవద్దనే ఆలోచనతో ఉందని తెలుస్తోంది.

రేవంత్ సామర్థ్యంపై ఆరా తీస్తున్న పెద్దలు

రేవంత్ సామర్థ్యంపై ఆరా తీస్తున్న పెద్దలు

సొంత నియోజకవర్గంలోనే పలువురు నేతలు రేవంత్‌కు దూరంగా జరుగుతుండటానికి తోడు, ఆయన సామర్థ్యంపై అధిష్టానం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కుంతియా, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఢిల్లీ పెద్దలు చర్చిస్తున్నారని తెలుస్తోంది. రేవంత్ రావడం వల్ల పార్టీకి ఎంత మేర ఫలితం, ఉపఎన్నికలు వస్తే ఆయన గెలుస్తారా అనే అంశాలపై ఆరా తీస్తోందని తెలుస్తోంది.

ఆ తర్వాతే నిర్ణయానికి వస్తారు

ఆ తర్వాతే నిర్ణయానికి వస్తారు

అందరి నుంచి పూర్తిస్థాయిలో ఫీడ్ బ్యాక్ తీసుకున్న అనంతరం కొడంగల్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఉప ఎన్నికకు అనుకూలంగా ఉండి, రేవంత్‌ను గెలిపించుకుంటే, ఆ తర్వాత అధికార పార్టీపై కాంగ్రెస్ మరింత ఒత్తిడి తెచ్చే అవకాశముంది. అయితే రేవంత్ మాత్రం ఉప ఎన్నికపై దూకుడుగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం దూకుడుగా లేరు. ఆలోచించి ముందుకెళ్లే యోచనలో ఉన్నారు.

English summary
The Congress party does not appear to be in a mood to throw a political challenge to the Chief Minister K Chandrasekhar Rao at this stage. The party is understood to have advised A Revanth Reddy, who had recently resigned from the TDP and joined Congress, not to quit his MLA’s post. According to sources, the party high command is holding talks with State party in-charge R C Khuntia, CLP leader K Jana Reddy and TPCC President N Uttam Kumar Reddy on the impact of Revanth’s resignation as MLA in the State politics, particularly and the political advantage to the Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X