వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోలీ అంటే వారికి పిడిగుద్దులాట ... ఎక్కడో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

హోలీ పండుగ వచ్చిందంటే చాలు అందరూ రంగులు పూసుకుని సరదాగా పండుగ జరుపుకుంటే, తెలంగాణ రాష్ట్రంలోని ఒక గ్రామంలో మాత్రం హోలీ పండుగ రోజు పిడి గుద్దులాటతో హోలీ పండుగను జరుపుకుంటారు. ఒకవేళ హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట లేకుంటే ఆ సంవత్సరం గ్రామంలో ఏదైనా జరిగితే దానికి పిడిగుద్దులాట ఆడకపోవటమే కారణం అని తెగ ఫీలైపోతారు ఆ గ్రామస్తులు. అందుకే ప్రతీ ఏటా ఆ గ్రామంలో హోలీ సంబరాల్లో భాగంగా పిడిగుద్దులాట ప్రాధాన్యత సంతరించుకుంది.

 సేవ్ వాటర్ .. సేఫ్ హోలీ .. పొడి రంగుల కేళి .. నీటిని కాపాడే హోలీ ఆడండి సేవ్ వాటర్ .. సేఫ్ హోలీ .. పొడి రంగుల కేళి .. నీటిని కాపాడే హోలీ ఆడండి

 అక్కడ హోలీ అంటే పిడిగుద్దులాటే

అక్కడ హోలీ అంటే పిడిగుద్దులాటే


హోలీ రోజు ఎవరైనా రంగులు చల్లుకుంటారు. రంగుల కేళి రంగేళి అంటూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. ఇష్టంలేని వారు హోలీకి దూరంగా ఉంటారు. అయితే ఒక ఊర్లో హోలీ లో భాగంగా మగవారంతా పిడికిళ్లతో కొట్టుకుంటారు. దానికి ‘పిడిగుద్దులాట' అని పేరు. ఒకరినొకరు కొట్టుకుంటే రక్తం రాకుండా ఉంటుందా ? గాయాలు కాకుండా ఉంటాయా ? అంటే లేదు అని చెప్పాలి. అయినా.. తమకేమీ కానట్లుగానే ఆ ఆటను కొనసాగిస్తారు. ఇలా హోలీ పండగ రోజు వినూత్న ఆచారంతో ఆకట్టుకునే ఆ గ్రామం మరెక్కడో లేదు నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని హున్స నే ఈ వింత ఆచారాన్ని పాటించే గ్రామం .

అనాదిగా ఆచారంగా పిడిగుద్దులాట .. ఆడకుంటే అరిష్టం అని భావన

అనాదిగా ఆచారంగా పిడిగుద్దులాట .. ఆడకుంటే అరిష్టం అని భావన


ఇక నేడు హోలీ సందర్భంగా ముష్టిఘాతాలతో ఉడుం పట్టు పట్టేందుకు సిద్ధమవుతున్నారు గ్రామ పురుష పుంగవులు. ఇదేం ఆట అని గతంలో ఓసారి ఈ పిడిగుద్దులాటను నిర్వహించలేదట. అయితే ఆ ఏడాది ఊర్లోని ట్యాంకు కూలిందని.. పిడిగుద్దులాటను జరపకపోవడం వల్లే ఈ అనర్థం జరిగిందని ప్రజలు బలంగా విశ్వసించారు. ఇక అంతే ఈ ఆచారాన్ని వదిలిపెట్టేదే లేదని తేల్చేశారు. ఇకకుల మతాలకు అతీతంగా ఈ పిడిగుద్దులాటను ఆడుతారు .

పిడిగుద్దులాట ఆపై అలాయ్ బలాయ్..

పిడిగుద్దులాట ఆపై అలాయ్ బలాయ్..

హోలీ రోజు సాయంత్రం గ్రామంలోని ప్రధాన కూడలిలో పురుషులు పిడికిళ్లను బిగించి ఒకరిపై ఒకరు అరగంట పాటు దాడి చేసుకుంటారు. తర్వాత పరస్పరం అలయ్‌బలయ్‌ చేసుకుంటారు. పిడిగుద్దుల్లో గాయపడిన వారు కామ దహన బుడిదను గాయాలకు పూసుకుంటారు. ఇలా చేస్తే.. మొండి గాయాలైనా మానిపోతాయని నమ్మకం. కాగా గ్రామస్థుల సమ్మతితోనే ప్రతి ఏటా ఈ క్రీడను జరుపుతున్నామని మాజీ సర్పంచ్‌ వరాజ్‌ పటేల్‌ తెలిపారు. మొత్తానికి చాలా వింతైన ఆచారంగా సాగే పిడిగుద్దులాట నిజామాబాద్ జిల్లాలో హోలీ స్పెషల్
.

English summary
Pidiguddulata of fisticuffs fight is a traditional game of Hunsa village in Nizamabad district. This game is played by the Hunsa villagers on the occasion of colours festival Holi for the prosperity and wellness of their village. Every year on the occasion of Holi, Hunsa villagers play this fisticuffs game irrespective of caste and religion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X