వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాగిలాలకి 8వేలు, హోంగార్డులకి 12వేలేనా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి మంచి వేతనం అందివ్వాలని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి శనివారం డిమాండ్ చేశారు.

కానిస్టేబుళ్లతో సమానంగా పని చేస్తున్న హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. హోంగార్డుల జీవితాల్లో వెలుగు నింపేంతవరకు ప్రభుత్వాలు, పార్టీలకు అతతీతంగా ఉద్యమిస్తామన్నారు.

తమ పోరాటం వల్లే మూడు వేలుగా ఉన్న హోంగార్డుల జీతం ప్రస్తుతం రూ.12 వేలకు పెరిగిందన్నారు. తమ ఉద్యమం జీతం పెంపు కోసమే కాదన్నారు.

 కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

హోంగార్డుల ఉద్యోగ భద్రత కల్పన, వెట్టి చాకిరి, శ్రమ దోపిడీ నిర్మూలన కోసమన్నారు. హోంగార్డుల సమస్యల పరిష్కారం కోసం శనివారం ఇందిరా పార్కు వద్ద ఒకరోజు దీక్ష నిర్వహించారు. దీక్షకు ఇరు రాష్ట్రాల నుంచి హోంగార్డులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.

 కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

ప్రభుత్వం కొత్తగా భర్తీ చేస్తున్న కానిస్టేబుల్, డ్రైవర్ పోస్టుల్లో సీనియారిటీ ఆధారంగా హోంగార్డులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

 కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

పోలీస్ శాఖలో జాగిలాలకు నెలకు ఎనిమిది వేలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, హోంగార్డులకు 12 వేల జీతం చెల్లించేందుకు ఇబ్బందులు పడుతోందని మండిపడ్డారు.

 కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

ప్రపంచంలో ఆదివారం కూడా సెలవులేని ఏకైక ఉద్యోగం హోంగార్డు అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హోంగార్డులను కానిస్టేబుళ్లుగా గుర్తించి వారితో సమానంగా సౌకర్యాలు కల్పించాలన్నారు.

English summary
Home Guards earn Rs.12,000 salary, larger sums are spent on police dogs: Kishan Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X