హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి వార్తలపై వివరణ అడిగితే కేసులు పెడతాం: హోంమంత్రి నాయిని

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని చంచల్‌గూడ జైలులో రూ.10 కోట్లతో నిర్మించిన కొత్త బ్యారక్‌ను హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభం సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాలి వార్తల (పుకార్లు)పై వివరణ అడిగితే కేసులు పెడతామంటూ ఆయన జర్నలిస్టులను హెచ్చరించారు.

కొత్త కాంప్లెక్స్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న వార్తలపై ఆయనను విలేకరులు వివరణ కోరారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన ఆయన మీడియా ప్రతినిధులపై శివాలెత్తిపోయారు. కొత్త కాంప్లెక్స్ నిర్మాణంలో అవకతవకలపై ప్రశ్నించిన జర్నలిస్టులపై హోంమంత్రి నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ ఖైదీల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జనవరి 26న మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తామన్నారు. ఖైదీల్లో సత్పవర్తన వచ్చేలా జైళ్ల శాఖ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.

Home minister nayani narasimha reddy fires on journalist at chanchalguda jail

పత్తి రైతులకు మద్దతు ధర దొరకడం లేదు: హరీశ్

పత్తి రైతులకు మద్దతు ధర దొరకడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన జిల్లాలోని మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీఐ నిర్లక్ష్యంతోనే ఆశించిన స్థాయిలో పత్తి కొనుగోళ్లు జరగడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తికి మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని త్వరలో కేంద్ర మంత్రిని కలుస్తామన్నారు. ప్రభుత్వం చోరవతో పత్తికి మద్దతు ఇప్పిస్తున్నామన్నారు.

వరి, మొక్కజొన్నను మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు. మంత్రి హరీశ్‌రావు వెంట అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు.

English summary
Home minister nayani narasimha reddy fires on journalist at chanchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X