హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముందుగా చెప్తే: సిస్టర్స్ హత్యపై నాయిని, మీరు చెప్పారుగా.. చేస్తాం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమ్మాయిల్ని వేధిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని, విషయాన్ని గోప్యంగా ఉంచి, ఇబ్బందులు పెడుతున్న పోకిరీల పని పోలీసులు చూసుకుంటారని, పరువు కోసం పోయి ముందుస్తు సమాచారంమివ్వకపోవడంవల్లే యామిని, శ్రీలేఖలను పోగొట్టుకున్నామని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం నాడు కొత్తపేట మోహన్ నగర్‌లో ఈ నెల 14న హత్యకు గురైన అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రులు హైమావతి, కృష్ణారెడ్డిలను పరామర్శించారు.

కర్మన్ ఘాట్ హస్తినాపురం నార్త్ కాలనీలోని బంధువుల ఇంట్లో ఉన్న వారిని సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్‌తో కలిసి పరామర్శించారు.

హోంమంత్రి నాయిని

హోంమంత్రి నాయిని

ఈ సందర్భంగా నాయిని విలేకరులతో మాట్లాడారు. హైదరాబాదులో 100 షి బృందాలు ఉన్నాయని, పోకిరీల విషయమై ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.

సీవీ ఆనంద్

సీవీ ఆనంద్

జంట హత్యల కేసులో ప్రేమోన్మాది అమిత్ సింగ్‌ను పట్టుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కొందరు రాజకీయ నాయకులు ధర్నా చేసేందుకు యత్నించారని మండిపడ్డారు.

పరామర్శ

పరామర్శ

అమిత్ సింగ్‌ను పట్టుకునేందుకు 50 మంది పోలీసులతో 8 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు.. ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని హోంమంత్రి, కమిషనర్‌ను కోరారు.

పరామర్శ

పరామర్శ

చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామని వారు చెప్పారు. మరో కుటుంబానికి ఇలాంటి బాధ తలెత్తకుండా చూడాలని హైమావతి కోరారు.

పరామర్శ

పరామర్శ

కర్మన్ ఘాట్ హస్తినాపురం నార్త్ కాలనీలోని బంధువుల ఇంట్లో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్‌తో కలిసి నాయిని పరామర్శించారు.

నయీంపై...

నయీంపై...

కాగా, నయీం అనుచరుల అంశం పైనా మాట్లాడారూ. తాము నయీం అనుచరులమని చెబుతూ మల్కాజిగిరిలో ఓ న్యాయవాదిని బెదిరించి రూ.కోటికి పైగా వసూలు చేసిన ఘటన పైన విలేకరులు హోంమంత్రి నాయిని పరామర్శించారు.

నయీంపై...

నయీంపై...

హోంమంత్రి స్పందిస్తూ.. నయీం ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. శివారులోని ఫంక్షన్ హాలులో వారం క్రితం ఓ కార్యక్రమానికి హాజరైనట్లు జరుగుతోన్న ప్రచారంపై స్పందిస్తూ.. తమకు సమాచారం లేదన్నారు. అతడి కోసం బృందాలు ఏర్పాటు చేశారా అని విలేకరులు ప్రశ్నించగా.. మీరు చెప్పారుగా ఏర్పాటు చేస్తామన్నారు.

English summary
Home Minister Nayini Narsimha on Tuesday meets Srilekha parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X