• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీళ్లు మనుషులేనా?: ప్రేమ పెళ్లి చేసుకున్నారని కొత్త జంటను దారుణంగా చంపేశారు

|

సిరిసిల్ల: ప్రేమ పెళ్లి చేసుకున్నారనే ఒకే ఒక్క కారణంతో ఆ కొత్త జంట పాలిట యువతి తరపు బంధువులే రాక్షసులయ్యారు. పెంచి పెద్ద చేశామన్న తమ ప్రేమను కూడా మర్చిపోయి ఆ కొత్త జంట ప్రాణం తీసి హంతకులయ్యారు. పెళ్లిన నాలుగు నెలలకే అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశారు.

కలకలం రేపిన హత్యలు

కలకలం రేపిన హత్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని బాల్‌రాజుపల్లిలో గురువారం జరిగిన ఈ కొత్త జంట హత్య కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బాల్‌రాజుపల్లికి చెందిన నేదూరి హరీశ్‌(22) గ్రామంలో ఆటో నడుపుకుంటున్నాడు. నేదూరి రచన(21) తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందారు. దీంతో రచన మేనమామల ఇంటి వద్ద ఉంటూ డిగ్రీ వరకు చదువుకుంది.

ప్రేమ చిగురించిందిలా..

ప్రేమ చిగురించిందిలా..

హరీశ్‌ ఇంటికి ఎదురుగానే రచన మేనమామల ఇల్లు ఉంది. అంతేగాక, ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉండటంతో హరీశ్, రచనల మధ్య నాలుగేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం సాగింది.

నాలుగు నెలల క్రితమే పెళ్లి..

నాలుగు నెలల క్రితమే పెళ్లి..

ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం హరీశ్‌, రచన బంధువులకు చెప్పకుండా పెళ్లి చేసుకొన్నారు. కొద్దిరోజులు పాటు మారుపాకలోని బంధువుల ఇంట్లో ఉన్నారు. ఇటీవల బాల్‌రాజుపల్లికి వచ్చారు. గతంలోనే ప్రేమ వ్యవహారం బయటపడినపుడు ఈ జంట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వీరి బంధువుల్ని పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

దారుణానికి తెగబడ్డారు..

దారుణానికి తెగబడ్డారు..

అయినా ప్రేమ పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని రచన బంధువులు గురువారం సాయంత్రం వీరు ఇంట్లో ఉండగా కిరాతకంగా ఇద్దరి గొంతులు కోసి హత్యచేశారు. రక్తపు మడుగులోనే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. అనంతరం నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వేములవాడ పట్టణ, గ్రామీణ సీఐలు శ్రీనివాస్‌, మాధవి, ఎస్‌ఐలు రాజశేఖర్‌, సైదారావులు ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. కాగా, నిందితులను అశోక్, చింటు, శేఖర్‌గా గుర్తించినట్లు సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a suspected case of honour killing, a newly wed couple was brutally attacked with swords by the relatives of the girl in Balrajpalli village of Vemulawada rural mandal on Thursday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more