వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం తలచుకుంటే కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టలేదా? బండిసంజయ్ ఆర్టీఐ దరఖాస్తులపై హాట్ డిబేట్!!

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా వేసిన అడుగులు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆర్టీఐ చట్టం కింద ఏకంగా 86 అంశాలపైన ఎనిమిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, అమలు చేసిన పథకాలు, అమలు చేయాల్సినవి, అలాగే ఇప్పటివరకు చేసిన ప్రభుత్వ ఖర్చులపై సమాచారాన్ని కోరుతూ దరఖాస్తులు దాఖలు చేశారు బండి సంజయ్. మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటనల విలువ పైన కూడా లెక్కలు ఇవ్వాలని దరఖాస్తు చేశారు. అయితే ఆర్టీఐ ద్వారా దరఖాస్తులు చేసి పక్కా ఆధారాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయాలనుకుంటున్న బీజేపీ తీరుపై ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

కేసీఆర్ అవినీతి ఆధారాలున్నాయన్న బీజేపీ ఆర్టీఐ దరఖాస్తులపై చర్చ

కేసీఆర్ అవినీతి ఆధారాలున్నాయన్న బీజేపీ ఆర్టీఐ దరఖాస్తులపై చర్చ

ఇప్పటివరకు బిజెపి జాతీయ నేతలు ఎప్పుడూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా కెసిఆర్ అవినీతిపై విమర్శలు చేస్తూ వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని, తమ వద్ద కేసీఆర్ అవినీతికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతూ వచ్చారు. ఇంతకాలం ఆధారాలు ఉన్నాయని చెప్పిన బీజేపీ నేతలు, ఇప్పుడు ప్రభుత్వం చేసిన అన్ని పనులపై వివరాలు కావాలని ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న బీజేపీ అన్ని శాఖల లోను వివరాలకోసం దరఖాస్తు చేసినా వివరాలు ఇవ్వవలసింది మాత్రం ఆయా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులే .

బండి సంజయ్ ప్రయత్నం ఆశించిన ఫలితాలు ఇవ్వదన్న చర్చ

బండి సంజయ్ ప్రయత్నం ఆశించిన ఫలితాలు ఇవ్వదన్న చర్చ

ప్రగతి భవన్ నిర్మాణం మొదలుకొని ప్రభుత్వ ప్రకటనల వరకు అన్ని విభాగాల నుంచి సమాచారం ఇవ్వాలని కోరినా ప్రభుత్వ శాఖల అధికారులు ఎలాంటి తేడాలు లేకుండా జాగ్రత్తగా సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే ఆ సమాచారాన్ని ఇవ్వరు అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. బండి సంజయ్ ఈ ప్రయత్నం ఆశించిన ఫలితాలను ఇవ్వబోదని చర్చ జరుగుతుంది. ప్రభుత్వ శాఖల నుండి ఇచ్చే సమాచారం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని అటు రాజకీయ వర్గాల నేతలు సైతం భావించటం లేదు.

కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించకుండా ఆర్టీఐ దరఖాస్తులా ?

కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించకుండా ఆర్టీఐ దరఖాస్తులా ?

ఇక ఇదే సమయంలో మరొక చర్చ కూడా జోరుగా సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వ ఏం చేసింది అన్న డేటా బయటకు తీయడం పెద్ద పని కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించితే, ఒకవేళ అవినీతి జరిగితే, కేసీఆర్ కుటుంబ అవినీతి బయటకు రాదా అంటూ చర్చ జరుగుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించకుండా ఆర్టీఐ దరఖాస్తులా అంటూ చర్చిస్తున్నారు.ఇప్పటికే అనేకమార్లు తెలంగాణ ప్రభుత్వం అవినీతి చేసింది అని చెప్తున్నా, సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిపై నిప్పులు చెరుగుతున్న కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చర్చ జరుగుతుంది.

 కేంద్రం తలుచుకుంటే కెసిఆర్ ను ఇరకాటంలో పెట్టలేదా?

కేంద్రం తలుచుకుంటే కెసిఆర్ ను ఇరకాటంలో పెట్టలేదా?


కేంద్రం తలుచుకుంటే కెసిఆర్ ను ఇరకాటంలో పెట్టలేదా? అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక ప్రత్యర్ధి పార్టీలు కాంగ్రెస్, వైయెస్సార్ తెలంగాణా పార్టీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. కెసిఆర్ అవినీతిని ఆర్టిఐ దరఖాస్తుల ద్వారా బట్టబయలు చేయాలనుకోవడం సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతుంది. ఇక ఇలాంటి సమయంలో బండి సంజయ్ ఆర్టీఐ దరఖాస్తులు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే పనికొస్తాయి,సమగ్ర సమాచారాన్ని ఇవ్వవు అన్న చర్చ జరుగుతుంది.

English summary
There is Hot debate on Bandi sanjay's RTI applications,while bjp's power in center. without using bjp power why Bandi sanjay seeking the information with RTI applications?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X