ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీలో చేరికలపై భట్టి వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డికి షాక్..చేరికలుంటాయా!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలతో కాస్త పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరికల తుఫాన్ కొనసాగుతుందని ఇటీవలే సంచలన ప్రకటన చేశారు. ఇక ఆ ప్రకటనకు తగ్గట్టే క్షేత్రస్థాయిలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్న వారంతా వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని, ఆయా స్థానాలలో వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశించి పార్టీలో చేరుతున్నట్లు గా చర్చ జరుగుతుంది. పార్టీ లో కొత్తగా చేరిన వారు రేవంత్ రెడ్డి నుండి టికెట్ విషయంలో స్పష్టమైన హామీతోనే పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

పార్టీలో చేరికలతో జోష్... భట్టి వ్యాఖ్యలతో కొత్త షాక్

పార్టీలో చేరికలతో జోష్... భట్టి వ్యాఖ్యలతో కొత్త షాక్

ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో చేరికలు కొనసాగుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా టిక్కెట్ ను ఆశిస్తున్న పలువురు ఆశావహులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ముఖ్యంగా తమకు ఏ పార్టీ టికెట్ ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక అలాంటి నేతలందరి దృష్టి కాంగ్రెస్ పార్టీ పైన ప్రధానంగా ఉన్న సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి.

కొత్తగా కాంగ్రెస్ లో చేరేవారికి టికెట్ ల హామీ ఇవ్వటం లేదు.. భట్టి వ్యాఖ్యలు

కొత్తగా కాంగ్రెస్ లో చేరేవారికి టికెట్ ల హామీ ఇవ్వటం లేదు.. భట్టి వ్యాఖ్యలు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని నమ్మి, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం పార్టీలోకి చేరుతున్న వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ఎన్ని సమస్యలు వచ్చినా పార్టీని కాపాడుకుంటూ ఖమ్మం జిల్లాలో పార్టీని కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో భట్టి విక్రమార్క కొత్తగా వచ్చిన వారిని పార్టీలోకి తీసుకున్నంత మాత్రాన కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి ఎవరికీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అసెంబ్లీ టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

చేరికలపై రేవంత్ రెడ్డి దూకుడుకు భట్టి వ్యాఖ్యలతో చెక్ ?

చేరికలపై రేవంత్ రెడ్డి దూకుడుకు భట్టి వ్యాఖ్యలతో చెక్ ?

కొత్తవారిని తీసుకున్నంత మాత్రాన పాతవారిని పార్టీ వదిలేస్తుంది అని అనుకోవద్దని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు, టిక్కెట్లు ఆశించి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని అనుకునేవారికి షాక్ అనే చెప్పాలి. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు ప్రోత్సహిస్తూ, టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులను కాంగ్రెస్ బాట పట్టించారని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డికి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు చేరికలపై ఆయన దూకుడుకు చెక్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. టికెట్లు ఇచ్చినా ఇవ్వకున్నా ఈ విషయాన్ని ప్రస్తుతం ప్రస్తావించడం కాంగ్రెస్ పార్టీకి ఓ రకంగా మైనస్ అన్న భావన వ్యక్తమవుతుంది.

రేవంత్ హామీలను పట్టించుకోవద్దు.. అన్నట్టు భట్టి వ్యాఖ్యలు.. పార్టీలో జోరుగా చర్చ

రేవంత్ హామీలను పట్టించుకోవద్దు.. అన్నట్టు భట్టి వ్యాఖ్యలు.. పార్టీలో జోరుగా చర్చ

ఏది ఏమైనా పెద్ద ఎత్తున పార్టీలో చేరికలతో కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో మైలేజ్ తీసుకురావడానికి రేవంత్ రెడ్డి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ నేతల ప్రకటనలు కొన్ని పార్టీపై అనుమానాలకు కారణంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి చాలామంది నేతలకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు అన్న ప్రచారం జరుగుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీలో అలాంటివేవీ నడవవు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నేతలెవరూ పట్టించుకోవద్దని సంకేతాలు భట్టి విక్రమార్క తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చినట్లుగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. భట్టి విక్రమార్క సొంత జిల్లా అయిన ఖమ్మం జిల్లాలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేరిక సమయంలో భట్టి విక్రమార్క సమాచారం ఇవ్వకపోవడంతో భట్టి రేవంత్ రెడ్డి పై ఆగ్రహంతో ఉన్నట్టుగా పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.

English summary
The new bustle continues with the joinings in the Congress party. Revanth Reddy was shocked by Bhatti's remarks that no one who had recently joined the Congress was guaranteed tickets. This leads to a debate over whether to take a check for joinings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X