వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రసవత్తరంగా అక్కడి రాజకీయం: రెడ్యా నాయక్ సంచలన వ్యాఖ్యలు, శంకర్ నాయక్‌కు కష్టాలేనా?

డోర్నకల్ నియోజకవర్గంలో మరో ప్రచారం కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. సిట్టింగులకే సీట్లు అని కేసీఆర్ పదేపదే చెబుతుండటంతో.. మహబూబాబాద్ టికెట్ కవితకు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.

|
Google Oneindia TeluguNews

మహబూబాబాద్: డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వ్యాఖ్యలతో మహబూబాబాద్ రాజకీయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే వ్యతిరేకతను మూటగట్టుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు చెక్ పెట్టేందుకు ఆయన పావులు కదుపుతున్నారా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు సిట్టింగ్ లకే సీట్లు అని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించి ఉండటం కూడా గమనించాల్సిన విషయం. రెడ్యా నాయక్ కుమార్తె మాజీ ఎమ్మెల్యే కవిత ప్రస్తుతం మహబూబాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడానికి ఆమె పోటాపోటీగా పర్యటిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.

శంకర్ నాయక్‌పై వ్యతిరేకత:

శంకర్ నాయక్‌పై వ్యతిరేకత:


కలెక్టర్ మీనాతో వివాదం శంకర్ నాయక్‌కు ప్రతికూలంగా మారింది. ఐఏఎస్ లు అందరూ కలిసి ఆయనపై ఫిర్యాదు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్ కూడా ఆయనతో క్షమాపణలు చెప్పించేదాకా ఊరుకోలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తారా? అన్న చర్చ కూడా జరిగింది. శంకర్ నాయక్ తీరు పట్ల నియోజకవర్గంలోను పలు ఫిర్యాదులు ఉన్నట్టు తెలుస్తుండటంతో.. మిగతా ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

శంకర్ నాయక్‌కు ఏమాత్రం తగ్గకుండా:

శంకర్ నాయక్‌కు ఏమాత్రం తగ్గకుండా:


కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అయిన కవిత.. తండ్రి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తో పాటే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా తన సొంత కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ వస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు పోటాపోటీగా నియోజకవర్గంలో కార్యకర్తలు, అనుచరులను పరామర్శిస్తున్నానరు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేస్తున్నారు. తాజాగా 'నాకు.. నా బిడ్డకు టికెట్లు' అంటూ రెడ్యానాయక్ వ్యాఖ్యలు చేయడం.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ఆమె ఎసరు పెట్టారా? అన్న చర్చకు తావిచ్చింది.

సత్యవతి రాథోడ్ సైలెంట్:

సత్యవతి రాథోడ్ సైలెంట్:

మహబూబాద్, డోర్నకల్ రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. డోర్నకల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసిన సత్యవతి రాథోడ్.. కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన రెడ్యా నాయక్ పై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రెడ్యానాయక్ కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో.. సత్యవతి రాథోడ్ ఇరుకునపడ్డారు. అయితే టీఆర్ఎస్ ఆమెకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. సిట్టింగులకే సీట్లు అని చెబుతున్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ రెడ్యా నాయక్ కు టికెట్ ఇచ్చేందుకే సత్యవతికి ఆ పదవి కట్టబెట్టారన్న ప్రచారం ఉంది. దీనికి తగ్గట్టు సత్యవతి రాథోడ్ కూడా సైలెంట్ అయిపోయినట్టే కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో ఆమె అంతగా పర్యటించడం లేదని చెబుతున్నారు.

కవిత దూకుడు:

కవిత దూకుడు:

ఇక ఇటు మహబూబాబాద్ రాజకీయం కూడా డోర్నకల్ తరహాలోనే సాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన రెడ్యా నాయక్ కుమార్తె, మాజీ ఎమ్మెల్యే కవిత.. టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ పై ఓటమి పాలయ్యారు. కానీ ఆ తర్వాత ఆమె కూడా టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు.

సీఎం కేసీఆర్ ఆమెకు రాష్ట్ర కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అయితే ఈ పదవితోనే సరిపెట్టుకోకుండా.. శంకర్ నాయక్‌పై ఉన్న వ్యతిరేకత రీత్యా.. ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడానికే కవిత ప్రయత్నిస్తున్నారన్న వాదన ఉంది. నియోజకవర్గంలో ఆమె దూకుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందంటున్నారు. కుమార్తెకు టికెట్ కోసం తండ్రి రెడ్యానాయక్ సీఎంతో మంతనాలు జరిపారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అలా అయితే కష్టమే:

అలా అయితే కష్టమే:

రెడ్యా నాయక్ కుమార్తె కవితకు కూడా కేసీఆర్ టికెట్ ఇస్తే.. రాష్ట్రంలో మిగతా నాయకుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికీ టికెట్ ఇస్తే.. మిగతా నేతలు కూడా ఆ ప్రతిపాదనలు ముందుకు తీసుకొస్తారు. దానికి తోడు ఉద్యమ సమయంలో పార్టీ తరుపున కష్టపడ్డ ఎంతోమంది టికెట్లపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇస్తే వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది.

మరో వాదన ఇలా:

మరో వాదన ఇలా:

డోర్నకల్ నియోజకవర్గంలో మరో ప్రచారం కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. సిట్టింగులకే సీట్లు అని కేసీఆర్ పదేపదే చెబుతుండటంతో.. మహబూబాబాద్ టికెట్ కవితకు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో డోర్నకల్ నియోజకవర్గం నుంచే ఆమెకు ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలని రెడ్యానాయక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే నియోజకవర్గం నుంచి తాను ఎంపీగా, కుమార్తె కవితను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే యోచనలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా గులాబీ బాస్ కేసీఆర్ దే అంతిమ నిర్ణయం కాబట్టి.. మహబూబాబాద్ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతారో వేచి చూడాలి.

English summary
Dornakal MLA Redya Naik comments raised a hot discussion in TRS Party, he is expecting MLA ticket for his daughter also
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X