వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

21 రోజుల్లోనే ఇళ్ళ నిర్మాణ అనుమతులు ... గడువు దాటితే అధికారులకు ఫైన్లు : త్వరలో టీఎస్‌బీపాస్‌

|
Google Oneindia TeluguNews

తెలంగాణా మున్సిపల్ మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అధికారుల పనితీరుపై దృష్టి సారించారు. తెలంగాణా రాష్ట్రంలో చాలా వరకు గృహ నిర్మాణాలకు అనుమతులు ఇబ్బందిగా మారుతున్న వేళ భవన నిర్మాణ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అముమతులను సులభతరం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణా సర్కార్ .

ఆకస్మిక తనిఖీలు,సమావేశాలు .. మునిసిపల్ సిబ్బంది,కాంట్రాక్టర్లను హడలెత్తిస్తున్న మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు,సమావేశాలు .. మునిసిపల్ సిబ్బంది,కాంట్రాక్టర్లను హడలెత్తిస్తున్న మంత్రి కేటీఆర్

గృహ నిర్మాణం చేసుకోదలచిన వారికి శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

గృహ నిర్మాణం చేసుకోదలచిన వారికి శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం


గృహ నిర్మాణం చేసుకోదలచిన వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించనుంది. టీఎస్‌బీపాస్ అమలుకు నిర్ణయం తీసుకున్న తెలంగాణా సర్కార్ కొత్తింటి నిర్మాణానికి 21 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించింది. గతంలో గృహ నిర్మాణాల పర్మిషన్ కోసం కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరిగిన వారికి వెసులు బాటుగా ఆన్ లైన్ లో అనుమతుల విధానం తీసుకొచ్చింది.

 టీఎస్‌బీపాస్ అమలుకు మూహూర్తం ఖరారు చేసిన సర్కార్

టీఎస్‌బీపాస్ అమలుకు మూహూర్తం ఖరారు చేసిన సర్కార్

ఇక ఈ విధానంలోనూ పలు సమస్యలు తలెత్తుతున్న వేళ భవన నిర్మాణ అనుమతులను మరింత సులభతరం చేసేలా నిర్ణయాలు తీసుకుంది. గృహ నిర్మాణ దారులకు అనుమతులు ఇవ్వటంలో ఉన్న సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన టీఎస్‌బీపాస్‌ విధానాన్ని మరింత సులభతరంగా చేసి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే అనుమతులు ఇవ్వనుంది . తాజాగా టీఎస్‌బీపాస్ అమలుకు మూహూర్తం ఖరారు చేసిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ అధికారులకు ఈ విధానం అమలుకు దిశా నిర్దేశం చేశారు.

21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు.. లేదంటే అధికారులకు జరిమానాలు

21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు.. లేదంటే అధికారులకు జరిమానాలు

భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరించిన తెలంగాణ ప్రభుత్వం 21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు ఇచ్చేలా తీసుకున్న నిర్ణయం మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది . ఈ మేరకు భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లో అన్ని అనుమతులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించిన మంత్రి విధించిన గడువు దాటిన పక్షంలో రోజుకు రూ.1000 చొప్పున సంబంధిత అధికారి నుంచి జరిమాన వసూలు చేయనున్నట్టు హెచ్చరించారు.

 భవన నిర్మాణ రంగంలోనూ పారిశ్రామిక అనుమతులకు ఉన్న విధానమే

భవన నిర్మాణ రంగంలోనూ పారిశ్రామిక అనుమతులకు ఉన్న విధానమే

పారిశ్రామిక విధానంలో పరిశ్రమలకు అనుమతుల జారీలో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉంది. ఇక అదే కోవలో భావన నిర్మాణ రంగం విషయంలో కూడా అనుమతులలో జాప్యం చేస్తే జరిమానా విధించే విధానాన్ని అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ అధికారులకు చెప్పారు. దీంతో భవన్ నిర్మాణ అనుమతులకు అధికారులు మరింత వేగంగా పని చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది. ఇక ఒకపక్క పట్టణ ప్రగతి అంటూనే మరో పక్క కొత్తకొత్త విధానాలను తీసుకురావటం అధికారులకు ఊపిరి ఆడకుండా చేస్తుంది.

English summary
In keeping with all the problems of granting permits to home owners, KTR has introduced a TS BPASS policy that will make it easier to apply within 21 days of application. If the deadline is exceeded, a fine of Rs 1000 per day will be charged from the concerned officer. Municipal minister KTR finalized the implementation of the latest TS BPASS, directed the implementation of the policy .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X