హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హత్య కేసులో ట్విస్ట్‌లు: ఫ్రెండ్‌కు మర్యాదలు చేస్తే.. సౌమ్యతో చనువు, మద్యం తాగిన సౌమ్య

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని ఎర్రగడ్డలో సంచలనం సృష్టించిన సౌమ్య హత్య కేసు మిస్టరీ వీడింది. భర్త నాగభూషణం స్నేహితుడు ప్రకాశ్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది.

చదవండి: సౌమ్యను చంపింది అతనే!: ఎవరీ ప్రకాష్?.. ఆరోజు రాత్రి ఏం జరిగింది?చదవండి: సౌమ్యను చంపింది అతనే!: ఎవరీ ప్రకాష్?.. ఆరోజు రాత్రి ఏం జరిగింది?

స్నేహితుడు అని నమ్మి ఎప్పటికీ ఇంటికి రానిస్తే భార్యతోనే వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు డబ్బు కోసం ఆమెనే కడతేర్చాడు ప్రకాశ్. డబ్బు ఇవ్వనని చెప్పడంతో సౌమ్యను ప్రకాశ్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి, అతనిని అరెస్టు చేశారు. నిందితుడు కూడా నేరాన్ని అంగీకరించాడు.

చదవండి: సౌమ్య మృతిలో ఒకరి కంటే ఎక్కువ!: పోలీసులకు చుక్కలు, ఫేస్‌బుక్-వాట్సాప్‌ల పరిశీలన చదవండి: సౌమ్య మృతిలో ఒకరి కంటే ఎక్కువ!: పోలీసులకు చుక్కలు, ఫేస్‌బుక్-వాట్సాప్‌ల పరిశీలన

వివాహేతర సంబంధానికి దారితీసింది

వివాహేతర సంబంధానికి దారితీసింది

పోలీసులు శనివారం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. అనంతపురం బత్తలపల్లి మండలం మాల్యావంతం గ్రామానికి చెందిన ప్రకాశ్, నాగభూషణంలు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి, అసోంలలో కలిసి పని చేశారు. ఆ తర్వాత ఇద్దరికి వేర్వేరు చోట్ల ఉద్యోగాలు వచ్చాయి. ప్రకాశ్ తరుచూ తన స్నేహితుడు నాగభషణం ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ప్రకాశ్‌కు సౌమ్యతో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఉద్యోగం పోవడంతో సౌమ్య వద్ద డబ్బు

ఉద్యోగం పోవడంతో సౌమ్య వద్ద డబ్బు

రెండేళ్ల క్రితం అంటే 2016లో నాగభూషణంకు ఎల్ అండ్ టీలో ఉద్యోగం వచ్చింది. దీంతో భార్యతో కలిసి ఎర్రగడ్డలో ఉంటున్నాడు. ఇటీవల ప్రకాశ్‌కు ఉద్యోగం పోయింది. ఖాళీగా ఉంటున్న ప్రకాశ్ జల్సాలకు, తాగుడుకు అలవాడు పట్టాడు. తరుచూ వచ్చి సౌమ్య వద్ద డబ్బులు తీసుకునేవాడు. లోన్‌లో ఇటీవల స్కార్పియోను కొనుగోలు చేశాడు.

మద్యం తాగిన సౌమ్య, భర్త వెళ్లాక సౌమ్య వద్దకు ప్రకాశ్

మద్యం తాగిన సౌమ్య, భర్త వెళ్లాక సౌమ్య వద్దకు ప్రకాశ్

ఉద్యోగం పోవడంతో ప్రకాశ్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టలేకపోయాడు. తన కిస్తీని కట్టాలని సౌమ్యను అడిగాడు. ఈ నెల 2వ తేదీన ప్రకాశ్ ఇంటికి వచ్చాడు. నాగభూషణం స్నేహితుడితో కలిసి మద్యం తాగాడు. అతనికి మర్యాదలు బాగా చేశారు. సౌమ్య కూడా వీరితో కలిసి మద్యం తాగింది. నాగభూషణం విధుల నిమిత్తం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ప్రకాశ్ సౌమ్య వద్దకు వచ్చాడు.

వివాహేతర సంబంధం భర్తకు చెబుతానని బ్లాక్‌మెయిల్

వివాహేతర సంబంధం భర్తకు చెబుతానని బ్లాక్‌మెయిల్

తన స్కార్పియో కిస్తీ కట్టేందుకు డబ్బులు ఇవ్వాలని ప్రకాశ్.. సౌమ్యను అడిగాడు. డబ్బు లేకుంటే నగలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె లేవని చెప్పింది. దీంతో అతను బ్లాక్ మెయిల్‌కు దిగాడు. మన వివాహేతర సంబంధం గురించి నీ భర్తకు చెబుతానని హెచ్చరించాడు. అయినా ఇవ్వనని ఆమె చెప్పడంతో డంబుల్ రాడ్డుతో తల, ఎడమకన్ను పైభాగంలో కొట్టాడు. బాత్రూంలోకి వెళ్లి రేజర్ బ్లేడ్ తీసుకు వచ్చి గొంతు కోశాడు.

చంపి, పారిపోయాడు

చంపి, పారిపోయాడు

ఆ తర్వాత పూజగదిలోని నూనెను తీసుకు వచ్చి సౌమ్య పైన పోశాడు. ఆమెకు నిప్పు పెట్టాడు. అప్పుడు సౌమ్య కొడుకు సాయిదత్తాత్రేయ ఇంట్లోనే మరో గదిలో నిద్రపోతున్నాడు. సౌమ్య ఫోన్‌ను బాత్రూంలో ఫ్లష్ ట్యాంకులో పడేసి, ఆధారాలు లేకుండా చేశాడు. సిలిండర్ గ్యాస్ వదిలాడు. సౌమ్య వంటిపై 3 తులాల బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్లిపోయాడు. వెళ్లేటప్పుడు బయట గడియ పెట్టాడు. పొగలు వస్తుండటంతో స్థానికులు కొడుకు సాయిదత్తాత్రేయను కాపాడారు. సిలిండర్ నుంచి గ్యాస్ రావడం చూసి ఆపివేశారు.

నాలుగు రోజుల్లో కేసు ఛేదన

నాలుగు రోజుల్లో కేసు ఛేదన

పోలీసులు ఈ కేసును నాలుగు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు అనంతపురంలో ఉన్నాడని గుర్తించి వారు అక్కడకు వెళ్లడంతో పోలీసులను చూసి ప్రకాశ్ పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆ తర్వాత అతను కూడా నేరాన్ని అంగీకరించాడు.

అందుకే దర్యాఫ్తు ఆలస్యం, అందుకే భర్త చెప్పలేదు

అందుకే దర్యాఫ్తు ఆలస్యం, అందుకే భర్త చెప్పలేదు

ప్రకాశ్ తన ఇంటికి వచ్చాడనే విషయాన్ని నాగభూషణం పోలీసుల విచారణలో వెల్లడించలేదు. ఆయన మొదటనే చెప్పి ఉంటే కేసు మిస్టరీ ముందుగానే వీడేది. తన స్నేహితుడిపై నాగభూషణంకు అనుమానం లేదు. పైగా సౌమ్య మద్యం తాగిందని చెప్పాల్సి వస్తుందని స్నేహితుడి విషయం చెప్పలేదని తెలుస్తోంది.

ఇలా చిక్కుముడి వీడింది

ఇలా చిక్కుముడి వీడింది

నాగభూషణంతో పాటు సౌమ్య తల్లిదండ్రుల, మరో బంధువును కూడా పోలీసులు విచారించారు. అప్పుడు వారు ప్రకాశ్ విషయమై వెల్లడించారు. ఆ కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేశారు. నాగభూషణంను అడిగారు. ఆ తర్వాత సౌమ్య ఫోన్‌ను బాగు చేయించారు. అందులోని కాల్స్ జాబితాలో ప్రకాశ్ పేరు కనిపించింది. దీంతో పోలీసులు కేసును ఛేదించారు. కాగా, హత్య అనంతరం సౌమ్య నగలను తీసుకొని హైదర్ నగర్‌లోని తన మిత్రుడు సుభాష్ వద్దకు వెళ్లాడు ప్రకాశ్. మరుసటి రోజు నగలను మిత్రుడి సాయంతో ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.82వేలు తీసుకున్నాడు. 60వేలు స్కార్పియో కిస్తీ చెల్లించాడు.

English summary
A killer’s haste to flee the city led the police to his doorstep in Anantapur for the murder of a 28 year old woman with whom he had an affair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X