వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణయ్ హత్య: భార్యను నమ్మించిన మారుతీరావు, అమృత ఫోన్ కాల్స్ కొంపముంచాయి

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రణయ్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

మిర్యాలగూడ: ప్రణయ్ పైన పలుమార్లు హత్యాయత్నం చేసి ఇప్పుడు అంతం చేశారు. అమృత తండ్రి మారుతీ రావు కిరాయి ముఠాతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. భార్య ద్వారా ఎప్పటికి అప్పుడు కుమార్తె గురించిన సమాచారం తెలుసుకున్నాడు. ఈ హత్యలో అస్గర్ అలీ, అబ్దుల్ వారీలో కీలకంగా వ్యవహరించారు. మూడు నెలలు రెక్కీ నిర్వహించారు. హత్యలో ఏడుగురు పాల్గొన్నారు. బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ హత్య చేశాడు. ఈ హత్యలో రాజకీయ కుట్ర లేదని మంగళవారం మీడియా సమావేశంలో ఎస్పీ రంగనాథ్ తేల్చి చెప్పారు.

చదవండి: ప్రణయ్ హత్య: పాతికేళ్ల క్రితం.. అమృత తండ్రి గురించి షాకింగ్ విషయాలు! కూతురుపై ఎంత ప్రేమంటే?

ప్రణయ్‌ను చంపేందుకు మారుతీరావు తన భార్య గిరిజారాణిని నమ్మించాడు. భార్య గిరిజారాణితో పలుమార్లు అమృతకు ఫోన్‌ చేయించి ఎప్పటికపుడు సమాచారం తెలుసుకున్నాడు. భార్యకు, కూతురుకు ఎలాంటి అనుమానం రాకుండా తాను కూడా అప్పుడప్పుడు అమృతతో మాట్లాడాడు. హత్యకు ముందు రోజు కూడా అమృత తన తండ్రి మారుతీరావుకు ఫోన్ చేసి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపింది.

చదవండి: స్నేహితుడి కొడుకుతో పెళ్లి చేయాలని: అమృత, తెరపైకి కొత్త పేర్లు, అతనే రంగంలోకి దిగాడు!

తల్లితో మాట్లాడించి, ఆమెకు తెలియకుండా

తల్లితో మాట్లాడించి, ఆమెకు తెలియకుండా

ఆ తర్వాత తల్లి గిరిజారాణి పూజ ఎలా చేసుకున్నామో తెలిపారు. తర్వాత రోజు అమృత, ప్రణయ్‌లు ఆసుపత్రికి వస్తారని మారుతిరావు తెలుసుకున్నారు. హత్యకు ప్లాన్ చేశారు. కన్నతల్లి ప్రేమతోనే మారుతి రావు... అమృత భర్తను చంపేశాడు. అమృత తల్లికి తెలియకుండానే ఈ వ్యవహారం నడిచింది. అబ్దుల్ బారీ, మారుతీరావు, కరీం, హత్య చేసిన సుభాష్‌ శర్మ కలిసి మిర్యాలగూడ ఆటోనగర్‌లో హత్యకు ప్లాన్ చేశారు. అమృత, ప్రణయ్‌లు తిరిగే ప్రదేశాలు గుర్తించారు. ప్రణయ్‌ను ఎలా హత్య చేయారో చర్చించారు.

పని పూర్తయిందని ఫోన్

పని పూర్తయిందని ఫోన్

ఆగస్టు 19న అమృత-ప్రణయ్‌లు మిర్యాలగూడలో డిన్నర్ ఇచ్చారు. దీంతో మరింత రగిలిపోయిన మారుతీరావు... ప్రణయ్‌ను సాధ్యమైనంత తొందరగా వదిలించుకోవాలనుకున్నాడు. ప్రణయ్‌ హత్య తర్వాత నల్గొండకు చేరుకున్న అస్గర్, సుభాష్ శర్మలు హైదరాబాద్‌ వెళ్తూ చౌటుప్పల్‌ వద్ద ఆగి అబ్దుల్‌బారీకి ఫోన్‌ చేశారు. పని పూర్తయిందని తెలిపారు. అబ్దుల్‌ బారీ ఈ విషయాన్ని మారుతీరావుకు చెప్పాడు. మిగిలిన డబ్బుల కోసం డిమాండ్‌ చేశాడు. తర్వాత మారుతీరావును పోలీసులు హైదరాబాద్‌లో పట్టుకోవడంతో నిందితులంతా వెలుగులోకి వచ్చారు.

వేర్వేరు ప్రాంతాల్లో దొరికారు

వేర్వేరు ప్రాంతాల్లో దొరికారు

ఈ హత్య కేసులో ఏ1 మారుతీరావు, ఏ2 సుభాష్ శర్మ, ఏ3 అస్గర్ అలీ, ఏ4 అబ్దుల్ బారీ, ఏ5 కరీం, ఏ6 అమృత బాబాయి శ్రవణ్, ఏ7 మారుతీరావు కారు డ్రైవర్‌ శివకుమార్‌లను వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకున్నారు. కాగా, అమృత - ప్రణయ్‌లకు ముప్పు పొంచి ఉందని తెలిసి పోలీసులు ముందు జాగ్రత్తలు తెలుసుకుంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని కొందరు అంటున్నారు. పోలీస్ స్టేషన్ మొదలు అధికారుల వరకు ఫిర్యాదులు చేసిన కౌన్సెలింగ్, సమన్వయం చేయడంలో విఫలమయ్యారని కొందరు అంటున్నారు.

ఇలా తప్పించుకునే ప్రయత్నం

ఇలా తప్పించుకునే ప్రయత్నం

హత్య తర్వాత తాను ఆ ప్రదేశంలో లేనంటూ మారుతీరావు నమ్మించడానికి పెద్ద ప్లాన్ ప్లాన్‌ వేశాడు. హత్య మధ్యాహ్నం జరగ్గా... అతడు అంతకు 2 గంటల ముందే మిర్యాలగూడ నుంచి నల్గొండ బయలుదేరాడు. మధ్యలో వేములపల్లి వద్ద అవసరం లేకపోయినా ఆగి ఆర్డీవో, డీఎస్పీని పలకరించాడు. నల్గొండకు కలెక్టరేట్‌కు వెళ్లి ఏం పనిలేకపోయినా జేసీ లేదా కలెక్టరును కలవడానికి ప్రయత్నించాడు. హత్య జరిగిందని తెలియగానే తన వాహనాన్ని నల్గొండలో వదిలేసి మరో వాహనంలో హైదరాబాద్ వెళ్లిపోయాడు.

English summary
Multiple meetings between the five main accused, fake sim cards, an advance of Rs 16 lakh and a deal for Rs 1 crore, was all that led to the death of Pranay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X