వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లా విద్యార్థిపై రేప్, హత్య: అతన్నెలా పట్టుకున్నారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

కొచ్చి: కేరళలో 30 ఏల్ దళిత న్యాయశాస్త్ర విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, ఆమె హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడు అమీరుల్ ఇస్లామ్ విషయంలో ఐడెంటిఫికేషన్ పరేడ్‌కు ఎర్నాకులం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ శనివారం అనుమతి మంజూరు చేశారు.

దళిత న్యాయశాస్త్ర విద్యార్థిని జిషాపై ఏప్రిల్ 28వ తేదీన అత్యాచారం, ఆమె హత్య జరిగిన విషయం తెలిసిందే. సంఘటన జరిగిన 50 రోజుల తర్వాత పోలీసులు నిందితుడ్ని అరె్టు చేశారు. నిందితుడు ఇస్లామ్ (23) అస్సాం నుంచి వలస వచ్చి ఇక్కడ కూలీ పని చేసుకుంటున్నాడు.

rape

విచారించిన తర్వాత అతన్ని పోలీసులు కాంచీపురంలో కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అతనికి జూన్ 30వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అతన్ని గుర్తించి పట్టుకోవడంలో పోలీసులకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అతని మిత్రుడు జింజల్ సహకరించాడు.

ఇస్లామ్‌ను తమిళనాడు కాంచీపురంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో అతన్ని పట్టుకున్నారు. జిషా హత్య తర్వాత కనిపించకుండా పోయిన వలస కూలీల గురించి పోలీసులు జింజల్‌ను విచారించారు. అతను అమీరుల్ ఇస్లామ్‌ పేరుతో పాటు మరి కొంత మంది పేర్లు చెప్పాడు. ఆ సమయానికి నిందితుడి ఫోన్ స్విచాఫ్ అయి ఉంది.

పోలీసులు అస్సాంలోని అతని స్వస్థలం దోల్డా గ్రామమ్‌ కూడా వెళ్లారు. ఏడు రోజుల పాటు అక్కడ ఉండి అతని వెళ్లిపోయినట్లు వారికి తెలిసింది. ఈ నెలారంభంలో కాంచీపురం చేరుకున్న అమీరుల్ జున్ 9వ తేదీన ఓ ఎలాక్ట్రానిక్ కంపెనీలో తాత్కాలిక ఉద్యోగిగా చేరాడు.

అతను తన పాత మొబైల్ ఫోన్‌లో కొత్త సిమి కార్డు వేసుకున్నాడు. వెంటనే పోలీసులు దాన్ని ట్రాక్ చేశారు. అయితే అతన్ని గుర్తించడానికి పోలీసుల వద్ద అతని ఫొటో గానీ ఇతర ఆధారాలు గానీ లేవు. నలుగురు పోలీసులతో కూడిన బృందం జింజాల్‌ను తమ వెంట కాంచీపురం తీసుకుని వెళ్లి అమీరుల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మొదటి మూడు రోజులు వారికి నిరాశే ఎదురైంది. జూన్ 13వ తేదీ సాయంత్రం ఫ్యాక్టరీ నుంచి కూలీలు బయటకు వస్తుండగా జింజాల్ తన మిత్రుడ్ని గుర్తించాడు. అమీరుల్ ప్రతిఘటించాడు. అయితే పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలావుంటే, ఓ స్థానిక వ్యక్తి నిందితుడు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడానికి సహకరించాడు. డివైఎఫ్ఐ పెంరుంబవూర్ బ్లాక్ కార్యదర్శి అరుణ్ ప్రశోబ్ వారికి సాయం చేశాడు. మే 19వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఓ భవనంపైకి ఎక్కి అతను వేడుక చేసుకున్నాడు. ఆ భవనం ఐదు నెలల పాటు అమీరుల్ ఉన్నట్లు భావిస్తున్న లాడ్జి పక్కనే ఉంది.

బాల్కనీ వరండాలో ఓ కత్తి పడి ఉండడాన్ని అతను గమనించాడు. అయితే, అతను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నిందితుడి అరెస్టుకు, ఇతర వివరాలకు సంబంధించిన వార్తలు రావడంతో అతను పోలీసులను అప్రమత్తం చేశాడు. అమీరుల్ ఇక్కడ ఉంటున్నట్లు తనకు తెలియదని లాడ్జి యజమాని కడప్పడం జార్జ్ చెప్పారు. అతను 19 మంది బెంగాలీలకు అద్దె సౌకర్యం కల్పించారు.

English summary
The Ernakulam chief judicial magistrate court on Saturday granted permission to conduct an identification parade of accused, Ameerul Islam, in the rape and murder case of a 30-year-old Dalit law student in Kerala on April 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X